గత ఏడాది జరిగిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దు చేసిన TSPSC
ప్రశ్నపత్రాల లీకేజీ కేసు నిందితుడు ప్రవీణ్ పెన్‌డ్రైవ్ లో ఇప్పటికే గుర్తించిన మూడు పరీక్షల ప్రశ్నా పత్రాలతో పాటు, మరో రెండు పరీక్షలకు సంబంధించిన ప్రశ్నా పత్రాలు కూడా ఉన్నట్టు FSL అధికారులు గుర్తించినట్టు సమాచారం.
పేపర్ లీకేజీ నేపథ్యంలో TSPSC, గత ఏడాది అక్టోబర్ 16న జరిగిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దు చేసింది. జూన్ 11 మళ్ళీ పరీక్ష నిర్వాహిస్తామని TSPSC అధికారులు తెలియజేశారు. ఇప్పటికే AE పరీక్ష తో పాటు టౌన్ ప్లానింగ్, వెటర్నరీ అసిస్టెంట్ ఎగ్జామ్ లను TSPSC రద్దు చేసింది. తాజాగా గ్రూప్-1 ప్రిలిమ్స్‌ను కూడా రద్దు చేస్తూ TSPSC నిర్ణయం తీసుకుంది. మిగతా పరీక్షలను మళ్ళీ ఎప్పుడు నిర్వహిస్తామన్నది త్వరలోనే తెలియజేస్తామని అధికారులు చెప్పారు.
కాగా ప్రశ్నపత్రాల లీకేజీ కేసు నిందితుడు ప్రవీణ్ పెన్‌డ్రైవ్ లో ఇప్పటికే గుర్తించిన మూడు పరీక్షల ప్రశ్నాపత్రాలతో పాటు, మరో రెండు పరీక్షలకు సంబంధించిన ప్రశ్నా పత్రాలు కూడా ఉన్నట్టు FSL అధికారులు గుర్తించినట్టు సమాచారం. అవి కాక.. ఎంవీఐ, గ్రౌండ్‌వాటర్ డిపార్ట్ మెంట్ పోస్టుల భర్తీకోసం నిర్వహించిన ప్రశ్నా పత్రాలు కూడా అతడి పెన్‌డ్రైవ్‌లో ఉన్నట్టు గుర్తించామని FSL అధికారులు సిట్ అధికారులకు సమాచారం ఇచ్చినట్టు తెలిసింది. AE పరీక్ష ప్రశ్నాపత్రం ఇచ్చినట్టుగానే మిగతా పరీక్షా పత్రాలను కూడా ప్రవీణ్ ఇంకెవరికైనా ఇచ్చాడా? లేదా? అనే విషయాన్ని తేల్చడానికి FSL అధికారులు ప్రయత్నిస్తున్నారు.