నేటినుంచి వెబ్ సైట్ లో TSPSC గ్రూప్-1 హాల్ టికెట్లు

11వతేదీ ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష జరుగుతుందని TSPSC తెలిపింది. పాత హాల్ టికెట్లు ఇప్పుడు పనికిరావని, మళ్లీ డౌన్ లోడ్ చేసుకోవాలని తెలిపింది.

Advertisement
Update:2023-06-04 07:53 IST

పరీక్ష పేపర్ లీకేజీ విమర్శలు, వివాదాలు, విచారణల తర్వాత TSPSC రెండోసారి గ్రూప్-1 ప్రిలిమినరీ టెస్ట్ కి పకడ్బందీగా ఏర్పాట్లు చేసింది. ఈనెల 11న ఈ పరీక్ష జరగాల్సి ఉంది. దీనికి సంబంధించి ఈరోజునుంచి హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చని TSPSC ప్రకటన విడుదల చేసింది. అభ్యర్థుల వివరాల ర్యాండమైజేషన్ తర్వాత హాల్ టికెట్లను వెబ్ సైట్లో ఉంచామని TSPSC తెలిపింది.

తెలంగాణలో 503 గ్రూప్‌-1 సర్వీసు ఉద్యోగాల భర్తీకోసం TSPSC గతేడాది ఏప్రిల్ లో నోటిఫికేషన్ జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 3.8 లక్షలమంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. గతేడాది అక్టోబర్-16న ప్రిలిమినరీ పరీక్ష జరిగింది కూడా. అయితే పేపర్ లీక్ కావడంతో దాన్ని రద్దు చేశారు. తాజాగా ఈనెల 11న నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. దీనికి సంబంధించి హాల్ టికెట్లు ఇప్పుడు విడుదల చేశారు. 11వతేదీ ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష జరుగుతుందని TSPSC తెలిపింది. పాత హాల్ టికెట్లు ఇప్పుడు పనికిరావని, మళ్లీ డౌన్ లోడ్ చేసుకోవాలని తెలిపింది.

ఈసారి పగడ్బందీ ఏర్పాట్లు..

ప్రిలిమినరీ పరీక్షలో పొరపాట్లు జరగకుండా పకడ్బందీగా నిర్వహించేందుకు TSPSC చర్యలు తీసుకుంది. పరీక్ష హాల్ ఎంట్రన్స్ వద్ద రెండంచెల తనిఖీ చేపడతారు. మెటల్‌ డిటెక్టర్లు, ఇతర పద్ధతుల్లో అభ్యర్థుల్ని రెండుసార్లు.. రెండు బృందాలు పూర్తిగా పరిశీలించిన తరువాతే ఎగ్జామ్ సెంటర్ లోకి అనుమతిస్తారు. అభ్యర్థులంతా గంట ముందుగా పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని, తనిఖీలకు సహకరించాలని సూచించారు అధికారులు. లైవ్ ఫొటో తీసుకుని, హాల్ టికెట్లో ఉన్న ఫొటోని బ్లాక్ చైన్ టెక్నాలజీ సహాయంతో పరీక్షిస్తారు. అభ్యర్థి అసలో కాదో నిర్థారించుకుంటారు. నిబంధనలు పాటించని అభ్యర్థులను బయటకు పంపించడంతో పాటు వారిపై పోలీసు కేసులు నమోదు చేస్తామని తెలిపారు అధికారులు.

Tags:    
Advertisement

Similar News