తెలంగాణలో టెన్త్ రిజల్ట్స్ వచ్చేశాయి..ఉత్తీర్ణత శాతం ఎంతంటే!
తెలంగాణలో పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఫలితాలను విడుదల చేశారు
Advertisement
తెలంగాణలో పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఫలితాలను విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు పదో తరగతి పరీక్షలు జరగగా..5 లక్షల 8 వేల 385 మంది విద్యార్థులు ఎగ్జామ్స్‌కు హాజరయ్యారు.
మొత్తంగా 91.23 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులవగా...ఈ సారి కూడా బాలికలే పైచేయి సాధించారు. బాలికల ఉత్తీర్ణత శాత 93.23 శాతంగా ఉంటే..బాలుర పాస్ పర్సంటేజీ 89.42 శాతంగా ఉంది.
99 శాతం ఉత్తీర్ణతతో నిర్మల్ జిల్లా టాప్ ప్లేసులో నిలవగా...65.10 శాతం పాస్ పర్సంటేజీతో వికారాబాద్ జిల్లా చివరి స్థానంలో నిలబడింది. రాష్ట్రవ్యాప్తంగా 3 వేల 927 పాఠశాలల్లో వంద శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఇక జూన్ 3 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి.
Advertisement