సెల్ ఫోన్ రికవరీ.. తెలంగాణ పోలీస్ నయా హిస్టరీ
కర్నాటకలో 36శాతం, ఏపీలో 30శాతం ఫోన్లను బాధితులకు అప్పగించగా.. 39శాతంతో తెలంగాణ దేశంలోనే నెంబర్-1 గా ఉంది. పోయిన సెల్ ఫోన్లను రికవరీ చేయడంలో తెలంగాణలో సీఐడీ నోడల్ ఏజెన్సీగా ఉంది.
గతంలో సెల్ ఫోన్ పోతే దానిపై ఆశలు వదిలేసుకోవాల్సిందే. వెంటనే సిమ్ బ్లాక్ చేసి కొత్త ఫోన్ కొనుక్కునేవారు బాధితులు. కానీ ఇప్పుడు సెల్ ఫోన్ రికవరీ అనేది సులభంగా మారింది. ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి పోయిన సెల్ ఫోన్లను ఇట్టే పట్టేస్తున్నారు పోలీసులు. ఈ విషయంలో తెలంగాణ పోలీసులు నెంబర్-1 స్థానంలో ఉన్నారు.
సెల్ ఫోన్లు పోయాయంటూ అందిన ఫిర్యాదులు 86,395
పోలీసులు ట్రేస్ చేసిన ఫోన్లు 25,598
బాధితులకు అప్పగించినవి 10,018
అంటే ట్రేస్ చేసిన వాటిలో దాదాపు 39శాతం ఫోన్లను బాధితులకు అప్పగించారనమాట. ఇది దేశంలోనే అత్యధికం. కర్నాటకలో 36శాతం, ఏపీలో 30శాతం ఫోన్లను బాధితులకు అప్పగించగా.. 39శాతంతో తెలంగాణ దేశంలోనే నెంబర్-1 గా ఉంది. పోయిన సెల్ ఫోన్లను రికవరీ చేయడంలో తెలంగాణలో సీఐడీ నోడల్ ఏజెన్సీగా ఉంది.
ఏప్రిల్-19న సెల్ ఫోన్ ఎక్విప్ మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్(సీఈఐఆర్) సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఆ తర్వాత సెల్ ఫోన్ రికవరీ సులభంగా మారింది. సెల్ ఫోన్ పోగొట్టుకున్న బాధితులు గతంలో మీసేవ, పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేయాల్సి వచ్చేది. ఇప్పుడు ‘టీఎస్ పోలీస్’ వెబ్ సైట్ లో సిటిజన్ పోర్టల్ లోనే ఫిర్యాదు చేసేందుకు అవకాశం ఉంది. సెల్ ఫోన్ పోయిన వెంటనే వెబ్ సైట్ లోని సిటిజన్ పోర్టల్ లో ఫిర్యాదు చేయాలని సూచించారు సీఐడీ చీఫ్ మహేష్ భగవత్.