ఉద్యోగుల వయోపరిమితిపై వార్తలు.. రేవంత్ ఏమన్నారంటే!
ఉద్యోగుల వయో పరిమితి అంశంపై జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని స్పష్టం చేసింది. ఈ అంశంపై ప్రభుత్వ స్థాయిలో ఏ విధమైన ప్రతిపాదన కానీ, ఫైల్ నిర్వహణ లేదని అధికార వర్గాలు స్పష్టం చేశాయి.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వయోపరిమితిపై జరుగుతున్న ప్రచారంపై స్పందించింది రేవంత్ రెడ్డి సర్కార్. ఉద్యోగుల వయో పరిమితి అంశంపై జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని స్పష్టం చేసింది. ఈ అంశంపై ప్రభుత్వ స్థాయిలో ఏ విధమైన ప్రతిపాదన కానీ, ఫైల్ నిర్వహణ లేదని అధికార వర్గాలు స్పష్టం చేశాయి.
ఇంతకీ ఏం జరిగిందంటే..రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వయోపరిమితి విషయంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారంటూ ప్రచారం జరిగింది. ఉద్యోగుల వయో పరిమితి 61 ఏళ్లు లేదా 33 ఏళ్లుగా ఉండేలా కసరత్తు చేస్తోందని. ఈ రెండింటిలో ఏది ముందు అయితే దానిని పరిగణనలోకి తీసుకునేలా అధికారులు కసరత్తు చేస్తున్నారంటూ వార్తలు వచ్చాయి. అయితే ఈ ప్రచారాన్ని తాజాగా రేవంత్ సర్కార్ ఖండించింది. వివిధ వార్త పత్రికలూ, సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని స్పష్టం చేసింది.