అది రాజ్ భవన్ కాదు.. రాజకీయ భవన్

ఎంపీ అర్వింద్ ని ఎల్లమ్మగుట్ట చౌరస్తాలో బట్టలు ఊడదీసి ఉరికించి కొడతామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. మరోసారి కవిత, కేసీఆర్ పై ఉద్దేశపూర్వకంగా విమర్శలు చేస్తే దాడులు చేస్తామని హెచ్చరించారు.

Advertisement
Update:2022-11-20 16:30 IST

రాజ్ భవన్ ను రాజకీయ భవన్ గా మార్చేశారంటూ మండిపడ్డారు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. తమిళిసై గవర్నర్ లా కాకుండా బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలిగా మారారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విచారణ సంస్థలను బీజేపీ దుర్వినియోగం చేస్తోందని విమర్శించారు. రాజ్ భవన్ లో రాజకీయాలు ఆపేయాలని డిమాండ్ చేశారాయన.

అర్వింద్ పై ఆగ్రహం..

బీజేపీ ఎంపీ అర్వింద్ ఇటీవల ఎమ్మెల్సీ కవితపై చేసిన వ్యాఖ్యల్ని టీఆర్ఎస్ తీవ్రంగా ఖండించింది. ఎంపీ అర్వింద్ పై కవిత కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో అర్వింద్ ని ఎల్లమ్మగుట్ట చౌరస్తాలో బట్టలు ఊడదీసి ఉరికించి కొడతామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. మరోసారి కవిత, కేసీఆర్ పై ఉద్దేశపూర్వకంగా విమర్శలు చేస్తే దాడులు చేస్తామని హెచ్చరించారు. ఎంపీ అర్వింద్ ని జిల్లాలో తిరగనివ్వబోమని, అడుగడుగునా అడ్డుకుంటామన్నారు.

ఫేక్, ఫ్రాడ్ ఎంపీ..

అర్వింద్ ఒక ఫేక్, ఫ్రాడ్ ఎంపీ అంటూ ఆరోపించారు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. అర్వింద్ కుటుంబం అవినీతి కుటుంబం అని విమర్శించారు. బాండ్ పేపర్ రాసి జిల్లా ప్రజలను మోసం చేశారని గుర్తు చేశారు. దమ్ముంటే ఆర్మూర్ లో అర్వింద్ తనపై పోటీ చేయాలని సవాల్ విసిరారు. అర్వింద్ ని చిత్తు చిత్తుగా ఓడిస్తానన్నారు. లిక్కర్ స్కామ్ లో టీఆర్‌ఎస్‌ ని లాగే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు జీవన్ రెడ్డి.

Tags:    
Advertisement

Similar News