కోరి ట్రోలింగ్ కొనితెచ్చుకున్న షర్మిల

గతంలో షర్మిలపై సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు వస్తే అప్పుడెందుకు హడావిడి చేశారని ప్రశ్నించారు. మీకొక న్యాయం, కవితకు మరో న్యాయమా అని కౌంటర్లిస్తున్నారు.

Advertisement
Update:2023-04-14 09:05 IST

ఆమధ్య వైజాగ్ స్టీల్ విషయంలో తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంపై సెటైర్లు వేసి విమర్శలు కొనితెచ్చుకున్నారు షర్మిల. వైజాగ్ స్టీల్ కంటే ముందు తెలంగాణ సమస్యలు పరిష్కరించాలంటూ ఆమె బీఆర్ఎస్ ప్రభుత్వానికి సూచించారు. ఏపీలో ఉన్న వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చడానికే ఆమె ఇలా ట్వీట్ చేశారంటూ నెటిజన్లు మండిపడ్డారు. మళ్లీ రోజుల వ్యవధిలోనే మరోసారి నెటిజన్లకు బుక్కయ్యారు షర్మిల. ఈసారి ఎమ్మెల్సీ కవిత విషయంలో ఆమె చేసిన‌ ట్వీట్ విమర్శలకు తావిచ్చింది.

సుఖేష్ అనే వ్యక్తితో తాను చాట్ చేసినట్టు ఫేక్ వార్తలు ప్రచారం చేస్తున్నారని మీడియాపై కవిత మండిపడగా.. ఆమె స్టేట్ మెంట్ కి షర్మిల కౌంటర్ ఇచ్చారు. తప్పులు చేసిన వారు మీడియాపై నిందలు వేయడమెందుకని వెటకారమాడారు. అయితే షర్మిల ట్వీట్ పై తెలంగాణవాదులు మండిపడుతున్నారు. గతంలో షర్మిలపై సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు వస్తే అప్పుడెందుకు హడావిడి చేశారని ప్రశ్నించారు. మీకొక న్యాయం, కవితకు మరో న్యాయమా అని కౌంటర్లిస్తున్నారు.


బతుకమ్మని ఎత్తుకుని తెలంగాణ ఉద్యమాన్ని జాగృతం చేసిన క‌విత‌పై, సమైక్యాంధ్ర ఉద్యమం నడిపిన షర్మిల విమర్శలు చేయడం.. దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉందని నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. అన్నమీద కోపం మామీద ఎందుకు చూపించడం అని మరొకరు కౌంటర్ ఇచ్చారు. అసలు బీజేపీనుంచి షర్మిలకు ఎంత ముట్టింది అని మరొకరు విమర్శలు మొదలు పెట్టారు. చెట్టు పేరు చెప్పుకుని కాయలమ్ముకుంటున్నారని ఒకరు, మీ పాదాల యాత్ర ఇక్కడ కాదు, ఢిల్లీలో మీ ఏపీకి ప్రత్యేక హోదా సాధించడం కోసం చేసుకోవాలని మరొకరు ట్విట్టర్లో బదులిచ్చారు. కవితపై కౌంటర్ కోసం షర్మిల వేసిన ట్వీట్లు ఆమెకే రివర్స్ లో తగిలాయి.

Tags:    
Advertisement

Similar News