ట్రాఫిక్‌ వాలంటీర్లుగా ట్రాన్స్‌జెండర్లు

ట్రాన్స్ జెండర్లకు తెలంగాణ ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది.

Advertisement
Update:2024-12-04 19:08 IST

తెలంగాణ ప్రభుత్వం ట్రాన్స్‌జెండర్ల‌కు కీలక బాధ్యతలు అప్పగించింది. హోంగార్డుల తరహాలో ట్రాన్స్ జెండర్లను కూడా వాలంటీర్లుగా నియమించనున్నారు. అర్హులైన వారిని ఎంపిక చేసి పది రోజులపాటు ట్రాఫిక్ విధులపై శిక్షణ అందిస్తారు. వీరికి ప్రత్యేక యూనిఫాంతోపాటు ప్రతి నెల నిర్దేశిత స్టైపెండ్ ఇవ్వనున్నట్లు సమాచారం. ఇక తెలంగాణవ్యాప్తంగా 3 వేల మందికి పైగా ట్రాన్స్ జెండర్లుంటే.. వారిలో నగరంలోనే వెయ్యి మంది ఉన్నట్టు ఒక అంచనా అంచనా.

తొలిసారిగా హైదరాబాద్ సిటీ కమిషనరేట్‌ పరిధిలో ఇవాళ నియామకాలు చేపట్టారు. గోషామహల్‌ స్టేడియంలో ట్రాన్స్‌జెండర్లకు ఫిజికల్ ఈవెంట్స్‌ నిర్వహించారు. రన్నింగ్‌, హైజంప్‌, లాంగ్‌ జంప్‌లో మెరిట్‌ ఆధారంగా ఎంపిక చేశారు. ఈవెంట్స్‌ తర్వాత మొత్తం 44 మందిని అధికారులు ఎంపిక చేశారు. సెలెక్ట్‌ అయిన వారిని ట్రైనింగ్‌ ఇచ్చి నియామకాలు చేపట్టనున్నారు. ఈ ఈవెంట్స్‌ను హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ స్వయంగా పరిశీలించారు. ఈవెంట్స్ నిర్వహణపై అధికారులతో చర్చించారు. అనంతరం పోలీసు కొలువు కోసం వచ్చిన ట్రాన్స్ జెండర్లతో కాసేపు సరదాగా సీపీ సీవీ ఆనంద్ ముచ్చటించారు. ట్రాన్స్ జెండర్ల, ట్రాఫిక్‌ వాలంటీర్లుగా తీసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులకు సూచించిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం వాలంటీర్లను ఏర్పాటు చేయసుకోనుంది.

Tags:    
Advertisement

Similar News