10 మంది ఐపీఎస్ అధికారుల బదిలీ
ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
Advertisement
తెలంగాణలో పది మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది. 2021, 2022 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్లకు అడిషనల్ ఎస్పీలుగా పోస్టింగులు ఇచ్చారు. గ్రేహౌండ్స్ ఏఎస్పీలుగా పని చేస్తున్న కాజల్ ను ఉట్నూర్ ఏఎస్పీగా, రాహుల్ రెడ్డిని భువనగిరి ఏఎప్పీగా, చిత్తరంజన్ ను ఆసిఫాబాద్ ఏఎస్పీగా, చైతన్య రెడ్డిని కామారెడ్డి ఏఎస్పీగా, చేతన్ నితిన్ ను జనగామ ఏఎస్పీగా, విక్రాంత్ కుమార్ సింగ్ ను భద్రాచలం ఏఎస్పీగా, శుభమ్ ప్రకాశ్ ను కరీంనగర్ రూరల్ ఏఎస్పీగా, రాజేశ్ మీనాను నిర్మల్ ఏఎస్పీగా, మౌనికను దేవరకొండ ఏఎస్పీగా బదిలీ చేశారు. భద్రాచలం ఏఎస్పీ అంకిత్ కుమార్ ను డీజీపీ ఆఫీస్‌లో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు.
Advertisement