పావురాన్ని రక్షించేందుకు మూడు జిల్లాలకు 10 నిమిషాల పాటు విద్యుత్ సరఫరా నిలిపివేసిన ట్రాన్స్‌కో

సోమవారం నాడు హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ వద్ద హైటెన్షన్‌ విద్యుత్‌ లైన్‌కు కాలుకు దారం చుట్టుకొని ఓ పావురం ప్రమాదకరంగా వేలాడుతుండటంతో దానిని రక్షించడం కోసం ప్రభుత్వ యంత్రాంగం , వాలంటీర్లు ఆరుగంటలు కష్టపడ్డారు.

Advertisement
Update:2022-12-13 07:46 IST

ప్రాణాపాయంలో ఉన్న ఒక పావురాన్ని రక్షించేందుకు ట్రాన్స్ కో మూడు జిల్లాల్లోని అనేక ప్రాంతాల్లో దాదాపు 10 నిమిషాల సేపు పవర్ సప్లై ఆపేసింది. అనేక మంది జంతు ప్రేమికులు ఆ పావురాన్ని రక్షించడం కోసం ఆరు గంటల పాటు హైరానా పడ్డారు. గంటకు రూ. 6,000 చెల్లించి బూమ్ లిఫ్ట్‌ను అద్దెకు తీసుకొని చివరకు పావురాన్ని రక్షించారు.

సోమవారం నాడు హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ వద్ద హైటెన్షన్‌ విద్యుత్‌ లైన్‌కు కాలుకు దారం చుట్టుకొని ఓ పావురం ప్రమాదకరంగా వేలాడుతుండటంతో దానిని రక్షించడం కోసం ప్రభుత్వ యంత్రాంగం , వాలంటీర్లు ఆరుగంటలు కష్టపడ్డారు.

సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు కొంతమంది జంతు ప్రేమికుల నుండి తమకు కి కాల్ వచ్చిందని అమీన్‌పూర్‌కు చెందిన యానిమల్ వారియర్స్ కన్జర్వేషన్ సొసైటీ వ్యవస్థాపకుడు ప్రదీప్ నాయర్ చెప్పారు. ఆ తర్వాత ఒక బృందం సంఘటనా స్థలానికి చేరుకుంది. ఇది 133-కెవి విద్యుత్ లైన్ కాబట్టి, పవర్ సప్లై ఆపకుండా పావురాన్ని రక్షించడం అసాధ్యం, అందువల్ల తాము ట్రాన్స్‌కో చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ డి.ప్రభాకరరావు కార్యాలయాన్ని సంప్రదించామని ఏడబ్ల్యూసీఎస్‌ సభ్యురాలు సంతోషి తెలిపారు. ఉన్నతాధికారుల చర్చలు, సంప్రదింపుల అనంతరం రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, హైదరాబాద్ జిల్లాల్లోని చాలా ప్రాంతాలకు 10 నిమిషాల పాటు విద్యుత్‌ సరఫరా నిలిపివేశారు.

అనంతరం AWCS కార్యకర్తలు గంటకు రూ. 6,000 చెల్లించి బూమ్ లిఫ్ట్‌ను అద్దెకు తీసుకుని పావురాన్ని రక్షించారు. ఆ పావురం ఆరోగ్యంగానే ఉన్నందున వెంటనే దానిని విడిచిపెట్టేశారు.

వాస్తవ రెస్క్యూ ప్రక్రియ 10 నిమిషాల్లో జరిగినప్పటికీ, బూమ్ లిఫ్ట్‌తో సహా వనరులను సమీకరించడానికి,

మొత్తం ప్రక్రియకు దాదాపు ఆరు గంటల సమయం పట్టిందని సంతోషి తెలిపారు.

ఒక పావురాన్ని రక్షించడం కోసం జంతు ప్రేమికులు, ట్రాన్స్ కో అధికారులు పూనుకున్న తీరు పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.

Tags:    
Advertisement

Similar News