హైదరాబాద్‌లో సుదీర్ఘ ట్రాఫిక్ ఆంక్షలు.. అసలు కారణం ఇదే

నేటి నుంచి మే 18 వరకు స్టేడియం చుట్టు పక్కల ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని రాచకొండ పోలీసులు తెలిపారు.

Advertisement
Update:2023-04-28 16:39 IST

హైదరాబాద్ నగర పరిధిలో నెల రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. నగరవాసులు ట్రాఫిక్‌కు సంబంధించిన అప్డేట్స్ తెలుసుకొని.. ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు. హైదరాబాద్‌లోని చింతల్ మార్కెట్ వద్ద ట్విన్ బాక్స్ కల్వర్డుపై జీహెచ్ఎంసీ పనులు కోసమే ఈ ఆంక్షలు విధిస్తున్నట్లు తెలిపారు. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఏప్రిల్ 28 నుంచి మే 28 వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయి. రద్దీని నివారించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

- చింతల్ మెయిన్ రోడ్డు నుంచి పద్మానగర్ రింగ్ రోడ్డు వైపు వెళ్లే ట్రాఫిక్.. ఎల్లమ్మ దేవాలయం-ఎడమ వైపు-వాణి నగర్-కుత్బుల్లాపూర్ గ్రామం వద్ద మళ్లించబడుతుంది.

- పద్మానగర్ రింగ్ రోడ్డు నుంచి వచ్చే ట్రాఫిక్‌.. మాణిక్య నగర్ కమాన్-ఢిల్లీ పబ్లిక్ స్కూల్ - పాండు విగ్రహం - చింతల్ ప్రధాన రహదారిపై మళ్లిస్తారు.

- పద్మానగర్ రింగ్ రోడ్డు నుంచి వచ్చే ట్రాఫిక్.. ఫైన్ చికెన్ మార్కెట్ - అంబేడ్కర్ నగర్ రోడ్డు - అంబేడ్కర్ విగ్రహం - కుడివైపు - రాంరెడ్డి నగర్ - రెయిన్ బో హైస్కూల్ ఐడీపీఎల్ మెయిన్ రోడ్డు వద్ద మళ్లించబడుతుంది.

ఎర్రగడ్డలో రోడ్డు మూసివేత..

హైదరాబాద్ ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ సమీపంలో మూడు నెలల పాటు ట్రాఫిక్ అమలు చేయబోతున్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. మెట్రో స్టేషన్ సమీపంలోని ఏజీ కాలనీ నుంచి లక్ష్మీ కాంప్లెక్స్ వరకు నాలా పునర్నిర్మాణ పనులను జీహెచ్ఎంసీ అధికారులు చేపడుతున్నారు. ఈ పనుల కారణంగా మూడు నెలల పాటు మెట్రో స్టేషన్ వద్ద ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. మార్చి 28 నుంచి జూలై 28 వరకు 90 రోజుల పాటు ఈ ఆంక్షలు ఉండనున్నాయి.

ఉప్పల్ స్టేడియం సమీపంలో ఆంక్షలు..

నేటి నుంచి మే 18 వరకు స్టేడియం చుట్టు పక్కల ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని రాచకొండ పోలీసులు తెలిపారు. ఐపీఎల్ మ్యాచ్‌లు వీక్షించడానికి వచ్చే అభిమానులు ఏక్ మినార్ మసీద్ రోడ్, స్టేడియం రోడ్, హిందూ ఆఫీస్ రోడ్ నుండి స్టేడియంకు చేరుకోవచ్చు. పార్కింగ్ కోసం ఇబ్బందులు పడకుండా.. అక్కడ సైన్ బోర్డులు ఏర్పాటు చేశామని.. దాని ప్రకారమే టూ, ఫోర్ వీలర్ వాహనాలను పార్కింగ్ చేయాలని చెప్పారు. స్టేడియం సమీపంలో ట్రాఫిక్ డైవర్షన్స్ కోసం ఎఫ్ఎమ్ రేడియోలో ఇచ్చే సూచనలు పాటించాలని కోరారు.

Tags:    
Advertisement

Similar News