కాంగ్రెస్‌కు 80 సీట్లకంటే తగ్గితే.. ఏ శిక్షకైనా సిద్ధం
2019 పార్లమెంటు ఎన్నికల్లో కేసీఆర్ కూతురు కవితను ఓడించినప్పటి నుంచి నిజామాబాద్ జిల్లాపై కేసీఆర్ కక్షగట్టి.. అభివృద్ధి చేయలేదన్నారు.
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 80 సీట్ల కంటే తక్కువ వస్తే.. కేసీఆర్ విధించే ఏ శిక్షకైనా సిద్ధమన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో నిర్వహించిన కాంగ్రెస్ బహిరంగ సభకు హాజరైన రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్ అభ్యర్థిని భూపతి రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించాలని ప్రజలను కోరారు. సిట్టింగ్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి వేల కోట్లు సంపాదించారని ఆరోపించారు.
సీఎం కేసీఆర్ కట్టుకున్నట్లే బాజిరెడ్డి కూడా ఫామ్‌హౌజ్‌లు కట్టుకున్నారని ఆరోపించారు. 2019 పార్లమెంటు ఎన్నికల్లో కేసీఆర్ కూతురు కవితను ఓడించినప్పటి నుంచి నిజామాబాద్ జిల్లాపై కేసీఆర్ కక్షగట్టి.. అభివృద్ధి చేయలేదన్నారు. నిజామాబాద్ జిల్లా ఎవరివైపు ఉంటుందో.. రాష్ట్రంలో అదే పార్టీ అధికారంలోకి వస్తుందన్నారు రేవంత్ రెడ్డి.
కాంగ్రెస్ హయాంలో కట్టిన సాగునీటి ప్రాజెక్టులను చూపి ఓట్లు అడుగుతాం.. కాళేశ్వరం ప్రాజెక్టును చూపించి ఓట్లు అడిగేందుకు కేసీఆర్ సిద్ధమా..? అంటూ సవాల్ విసిరారు రేవంత్. రాష్ట్రంలో యువత, రైతులు, నిరుద్యోగులు, మహిళలు అందరూ కలిసికట్టుగా కాంగ్రెస్ పార్టీకి 80 సీట్లు ఇస్తారని, ఒక్క సీటు తగ్గినా సీఎం కేసీఆర్ వేసే శిక్షకు సిద్ధంగా ఉంటానని రేవంత్ అన్నారు.