ఎవరికో ఒకరికి మాత్రమే రైతు భరోసా- రేవంత్ క్లారిటీ

కౌలు రైతుకు రైతు భరోసా అమలు చేస్తే అసలు రైతుకు సాయం అందుతుందా లేదా.. అనేదానిపై సస్పెన్స్‌ నెలకొంది. దీనిపై క్షేత్రస్థాయిలోనూ చర్చ జరుగుతోంది.

Advertisement
Update:2023-11-26 13:20 IST

తెలంగాణ ఎన్నికలు ప్రధానంగా రెండు అంశాల చుట్టే తిరుగుతున్నాయి. ఒకటి వ్యవసాయం, రెండోది నిరుద్యోగం. ఇప్పటికే బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుబంధు, రైతుబీమా లాంటి అనేక పథకాలు అమలు చేస్తోంది. కాంగ్రెస్ సైతం మేనిఫెస్టోలో రైతు భరోసా కింద రైతులు, కౌలు రైతులకు రూ.15 వేలు, రైతు కూలీలకు రూ.12 వేలు ఇస్తామని హామీ ఇచ్చింది.

అయితే కాంగ్రెస్ అమలు చేస్తానన్న రైతు భరోసా విషయంలో గందరగోళం నెలకొంది. కౌలు రైతుకు రైతు భరోసా అమలు చేస్తే అసలు రైతుకు సాయం అందుతుందా లేదా.. అనేదానిపై సస్పెన్స్‌ నెలకొంది. దీనిపై క్షేత్రస్థాయిలోనూ చర్చ జరుగుతోంది. తాజాగా రేవంత్ రెడ్డి ఈ అంశంపై క్లారిటీ ఇచ్చారు. కౌలు రైతులకు సాయం ఇస్తే భూ యజమానికి ఎలాంటి ఆర్థిక సాయం ఇవ్వమన్నారు. దాంతో పాటు భూ యజమానికి రైతు భరోసా కింద సాయం అందితే కౌలు రైతుకు ఎలాంటి సాయం చేయబోమన్నారు. ఒక్కరికి ఏదో ఒక పథకం మాత్రమే వర్తిస్తుందన్నారు. ప్రస్తుతం తెలంగాణలో 75 లక్షల మంది భూ యజమానులు ఉండగా.. 20 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారు. అయితే కౌలు రైతులను ఎలా గుర్తిస్తారు అన్న విషయంలో కూడా క్లారిటీ లేదు.

ఇక వందల ఎకరాల భూములున్నవారికి బీఆర్ఎస్ రైతు బంధు ఇస్తుందని ఆరోపణలు చేసిన కాంగ్రెస్ మాత్రం తన మేనిఫెస్టోలో భూమికి ఎలాంటి కటాఫ్ పెట్టలేదు. దీనిపై కూడా క్లారిటీ రావాల్సి ఉంది. ఎంత భూమి ఉన్న రైతు భరోసా ఇస్తారా.. లేదా ప్రత్యేకంగా ఇన్ని ఎకరాలలోపు అని ఏమైనా నిబంధనలు పెడతారా అనేది తేలాల్సి ఉంది.

Tags:    
Advertisement

Similar News