చిరంజీవితో సహా టాలీవుడ్ ప్రముఖ హీరోలు కేటీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు...ఎందుకంటే...?
హైదరాబాద్ లో ఈ రేస్ ఏర్పాటుకు కారణమైన ఐటీ, పరిశ్రమల శాఖా మంత్రి కేటీఆర్ కు టాలీ వుడ్ ప్రముఖులు కృతజ్ఞతలు తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగ చైతన్య, సుమంత్ తదితరులు ఆ రేస్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నామని చెప్పారు.
ఫిబ్రవరి 11న హైదరాబాద్ నగరంలో మొట్టమొదటి ఫార్ములా E ప్రపంచ ఛాంపియన్ షిప్ జరగనుండటంతో రేసింగ్ ఔత్సాహికులలో ఉత్సాహం కనిపిస్తోంది. టాలీవుడ్ హీరోలు కూడా ఈ రేస్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
హైదరాబాద్ లో ఈ రేస్ ఏర్పాటుకు కారణమైన ఐటీ, పరిశ్రమల శాఖా మంత్రి కేటీఆర్ కు టాలీ వుడ్ ప్రముఖులు కృతజ్ఞతలు తెలిపారు.
మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగ చైతన్య, సుమంత్ తదితరులు ఆ రేస్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నామని చెప్పారు.
“భారతదేశానికి , ముఖ్యంగా హైదరాబాద్‌కు ఈ ఫార్ములాను తీసుకువచ్చినందుకు ప్రియమైన పరిశ్రమల శాఖ మంత్రి కెటి రామారావు, అనిల్ చలమలశెట్టి (గోపి)లకు నా శుభాకాంక్షలు. ” అని చిరంజీవి జనవరి 17న ట్వీట్ చేశారు.
ఆదివారం నాడు నటులు సుమంత్, అక్కినేని నాగ చైతన్య కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
“ భారతదేశంలో మొట్టమొదటి ఫార్ములా ఈ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌కు హైదరాబాద్ ఆతిథ్యం ఇస్తోంది, ఇది స్ట్రీట్ రేస్ ...ఇది రెట్టింపు ఉత్సాహాన్ని కలిగిస్తుంది. ముఖ్యమంత్రి కేసీఆర్, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కు ధన్యవాదాలు, ”అని అక్కినేని నాగ చైతన్య ట్వీట్ చేశారు.
గత అక్టోబర్‌లో ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు ఛాంపియన్‌షిప్‌ను నిర్వహించేందుకు పోటీ పడగా, చివరికి హైదరాబాద్‌ను ఎంపిక చేశారు. జనవరి 12న ముంబైలోని గేట్‌వే ఆఫ్ ఇండియాలో జరిగిన హైదరాబాద్ ఇ-ప్రిక్స్‌లో కేటీఆర్ మాట్లాడుతూ, “ఇది హైదరాబాద్ కో లేదా తెలంగాణ కో మాత్రమే గర్వకారణం కాదు, ఇది భారతదేశానికి గర్వకారణం'' అన్నారు.
హుస్సేన్ సాగర్ చుట్టూ ఈ రేసు జరగనుంది. 22 మంది డ్రైవర్లు, తొమ్మిది దేశాల నుండి 11 జట్లు న్యూ జనరేషన్ 3 ఎరా ఫార్ములా E కార్లలో రేసింగ్‌లో పాల్గొంటాయి.