కేసీఆర్ ఆన్ డ్యూటీ.. నేడు రెండు సభలు
ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు జనగామ సభ. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ లో నేరుగా సభా ప్రాంగణం వద్దకు చేరుకుంటారు సీఎం కేసీఆర్. జనగామ సభ ముగిసిన తర్వాత భువనగిరి వెళ్తారు.
ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలవడంతో.. సీఎం కేసీఆర్ స్పీడ్ పెంచారు. ఇప్పటికే సర్వేలన్నీ సానుకూలంగా ఉన్నా, ప్రత్యర్థులు రోజురోజుకీ మరింత బలహీనపడుతున్నా.. ఆయన మాత్రం ఎలాంటి ఛాన్స్ తీసుకునేలా లేరు. బీఫామ్ ల విషయంలోనే అభ్యర్థులకు చాలా జాగ్రత్తలు చెప్పారు. ఏ ఒక్క కార్యకర్తను నిర్లక్ష్యం చేయొద్దని, చేస్తే ఫలితాలు ఎలా ఉంటాయనే విషయంలో కూడా హెచ్చరికలు జారీ చేశారు. క్షణం తీరిక లేకుండా వరుస సభలతో బిజీ అయ్యారు కేసీఆర్. నిన్న హుస్నాబాద్ సభ తర్వాత ఈ రోజు రెండు సభలకు ఆయన హాజరుకాబోతున్నారు.
జనగామ సభకు సర్వం సిద్ధం..
ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు జనగామ సభ. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ లో నేరుగా సభా ప్రాంగణం వద్దకు చేరుకుంటారు సీఎం కేసీఆర్. జనగామలో సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిని కాదని అక్కడ పల్లా రాజేశ్వర్ రెడ్డికి టికెట్ కేటాయించారు. పల్లాకు ఇప్పటికే బీఫామ్ కూడా ఇచ్చారు సీఎం కేసీఆర్. ఈ రోజు సభలో పల్లాను గెలిపించాలని ఆయన జనగామ ప్రజలకు పిలుపునిచ్చేందుకు వస్తున్నారు.
జనగామ సభ ముగిసిన తర్వాత సీఎం కేసీఆర్ భువనగిరి వెళ్తారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీ మైదానంలో జరిగే ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొంటారు. బహిరంగ సభ నేపథ్యంలో భువనగిరి పట్టణం గులాబీమయంగా మారింది. జనం ఇబ్బందులు పడకుండా పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. భువనగిరి సభకు 60 వేల మందికి పైగా జనం వస్తారని అంచనా. భువనగిరిలో సిట్టింగ్ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డికి మరోసారి టికెట్ కేటాయించారు సీఎం కేసీఆర్.
♦