సిద్ధిపేట, సిరిసిల్లలో నేడు కేసీఆర్ సభలు..

ఈ రోజు సీఎం కేసీఆర్ రెండు చోట్ల బహిరంగ సభల్లో పాల్గొనబోతున్నారు. సిద్ధిపేట, సిరిసిల్లలో ఈ రోజు భారీ బహిరంగ సభలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.

Advertisement
Update:2023-10-17 10:29 IST

మేనిఫెస్టో విడుదల తర్వాత ఒక్కరోజు కూడా గ్యాప్ లేకుండా వరుస సభలకు హాజరవుతున్నారు సీఎం కేసీఆర్. అక్టోబర్ 15తో మొదలైన సభలు నవంబర్ 9 వరకు కొనసాగుతాయి. ఈ రోజు సీఎం కేసీఆర్ రెండు చోట్ల బహిరంగ సభల్లో పాల్గొనబోతున్నారు. సిద్ధిపేట, సిరిసిల్లలో ఈ రోజు భారీ బహిరంగ సభలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.

సిరిసిల్ల పట్టణంలోని సభాస్థలి దగ్గర ఏర్పాట్లను మంత్రి కేటీఆర్ పరిశీలించారు. ప్రణాళికా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ తో కలిసి ఆయన ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఇక సిద్ధిపేటలో ఏర్పాట్లను మంత్రి హరీష్ రావు పరిశీలించారు. 20వేల మందితో బైక్ ర్యాలీకి ఏర్పాట్లు జరుగుతున్నాయి. సభకు లక్ష మంది హాజరవుతారని అంచనా. సిద్ధిపేటకు రైలు వచ్చిన తర్వాత తొలిసారి సీఎం కేసీఆర్ పర్యటించబోతున్నారు. ఈ నేపథ్యంలో సీఎంకి భారీ స్వాగత ఏర్పాట్లు చేశారు.

కేసీఆర్ ప్రసంగంపై ఆసక్తి..

సహజంగా కేసీఆర్ ప్రసంగం అంటే ప్రతిపక్షాలకు వణుకు పుట్టడం ఖాయం. మేనిఫెస్టో విడుదల తర్వాత జరిగిన సభల్లో మాత్రం కేసీఆర్, ఆ స్థాయిలో విమర్శలకు పదును పెట్టలేదు. కేవలం ధరణి గురించి, రైతులకు ఉచిత విద్యుత్ గురించి మాత్రమే కాంగ్రెస్ వైఖరిని తప్పుబట్టారు. బీజేపీపై ఇంకా పూర్తి స్థాయిలో ఆయన విమర్శలు ఎక్కుపెట్టలేదు. సిరిసిల్ల, సిద్ధిపేట సభల్లో కేసీఆర్ వైరి వర్గాలకు ఫుల్ డోస్ ఇచ్చేస్తారనే అంచనాలున్నాయి. 


Tags:    
Advertisement

Similar News