ఎయిమ్స్ తరహాలో టిమ్స్.. బిల్లు ప్రవేశపెట్టిన మంత్రి హరీష్ రావు
TIMS ఆస్పత్రులతో ప్రజలకు అత్యాధునిక సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలతోపాటు వైద్య విద్యార్థులకు శిక్షణ అందించబోతున్నట్టు వెల్లడించారు మంత్రి హరీష్ రావు. TIMS ఆసుపత్రులకు స్వయం ప్రతిపత్తి ఉంటే త్వరితగతిన నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంటుందని తెలిపారు.
తెలంగాణ వైద్య విజ్ఞాన సంస్థ బిల్లుని మంత్రి హరీష్ రావు శనివారం అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. తెలంగాణ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (TIMS) ఆసుపత్రులను ప్రపంచస్థాయి వైద్య విజ్ఞాన సంస్థలుగా ఏర్పాటు చేయాలనేది సీఎం కేసీఆర్ సంకల్పమని ఆయన చెప్పారు. TIMS ఆస్పత్రులకు స్వయంప్రతిపత్తి కల్పించేందుకు TIMS యాక్ట్-2023 పేరుతో ఈ బిల్లు రూపొందించారు.
TIMS ఆస్పత్రులతో ప్రజలకు అత్యాధునిక సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలతోపాటు వైద్య విద్యార్థులకు శిక్షణ అందించబోతున్నట్టు వెల్లడించారు మంత్రి హరీష్ రావు. TIMS ఆసుపత్రులకు స్వయం ప్రతిపత్తి ఉంటే త్వరితగతిన నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంటుందని తెలిపారు. ఇప్పటికే నిమ్స్ కు ఈ హోదా కల్పించడం ద్వారా చాలా అభివృద్ధి సాధించిందని వివరించారు. ‘‘ఎయిమ్స్, పీజీఐ చండీగఢ్ తరహాలో TIMS కు స్వయం ప్రతిపత్తి ఇవ్వడానికి TIMS యాక్ట్ ను చట్టసభల ఆమోదం కోసం ప్రవేశపెట్టామని తెలిపారు మంత్రి హరీష్ రావు.
TIMS ఆస్పత్రులను హైదరాబాద్ నగరం నలుమూలలా నిర్మిస్తున్నట్టు తెలిపారు మంత్రి హరీష్ రావు. రాష్ట్ర ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను మరింత మెరుగ్గా అందించేందుకు TIMS ఆసుపత్రుల్లో 10 వేల సూపర్ స్పెషాలిటీ బెడ్స్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. 1000 ఆక్సిజన్ బెడ్స్, 300 ఐసీయూ బెడ్స్ ఉంటాయని మంత్రి వివరించారు. వీటిల్లో 16 స్పెషాలిటీ, 15 సూపర్ స్పెషాలిటీల్లో పీజీ కోర్సులు ఏర్పాటవుతాయని చెప్పారు. సూపర్ స్పెషాలిటీల్లో నర్సింగ్, పారామెడికల్ విద్యతోపాటు గుండె, కిడ్నీ, లివర్, ఊపిరితిత్తులు, క్యాన్సర్ తదితర 30 విభాగాలుంటాయన్నారు. ఈ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది.