అలాంటి వారికి ఈ వ్యాజ్యం గుణపాఠం కావాలె
కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థ పాలన వల్లనే రాష్ట్ర ఆర్థికవ్యవస్థ కుదేలైందన్న కేటీఆర్
కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థ పాలన వల్లనే రాష్ట్ర ఆర్థికవ్యవస్థ కుదేలైందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ పదేళ్ల పాలనలో బుల్లెట్ వేగంతో పరుగులు తీసిందన్నారు. నిరాధార ఆరోపణలు, వ్యక్తిగత దాడులు చేసే వారిపై పోరాటం చేస్తామన్నారు. మంత్రి కొండా సురేఖపై రూ. వంద కోట్ల పరువు నష్టం దావా వేసినట్లు చెప్పారు. ఇలాంటి చౌకబారు ఆరోపణలకు అడ్డూ అదుపు ఉండటం లేదన్నారు. సోషల్ మీడియా ద్వారా వ్యక్తిత్వాన్ని దెబ్బతీయడానికి యత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక నుంచి అలాంటి ఆరోపణలు చేయకుండా లక్ష్మణరేఖ గీయాలని, చౌకబారు విమర్శలు చేసే వారికి ఈ వ్యాజ్యం గుణపాఠం కావాలన్నారు. కోర్టులో నిజం గెలుస్తుందనే నమ్మకం ఉందన్నారు. అలాగే తాను వ్యక్తిగత వివాదాల కంటే ప్రజాసమస్యలకే ప్రాధాన్యం ఇస్తానని తెలిపారు.