హైదరాబాద్‌లో భారీ చోరీ.. రూ.4 కోట్లు మాయం..?

ఈనెల 12న పని మీద బయటకువెళ్లిన చౌదరి.. రాత్రి 11 గంటలు దాటిన తర్వాత ఇంటికి తిరిగివచ్చాడు. అయితే పెంట్‌ హౌస్‌ మెట్లు, గోడలు, తలుపులు దెబ్బతిని ఉండడాన్ని చూసి షాక్‌ అయ్యాడు.

Advertisement
Update:2023-09-17 10:02 IST

సొంతింటి కలను నిజం చేసుకునేందుకు రూపాయి రూపాయి ఆదా చేసుకుంటూ కోట్లు కూడబెట్టాడు. ఆ డబ్బును ప్రస్తుతం అద్దెకున్న ఇంట్లో దాచుకున్నాడు. అయితే పని మీద బయటకు వెళ్లి వచ్చి చూసేసరికి కోట్ల రూపాయల సొమ్ము మాయమైంది. ఈ ఘటన హైదరాబాద్ మధురానగర్ పీఎస్‌ పరిధిలో జరిగింది. 3 కోట్ల 93 లక్షల నగదుతో పాటు, 450 గ్రాముల బంగారాన్ని గుర్తు తెలియని వ్యక్తులు దోచేశారు. ఈ ఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

హైదరాబాద్‌లోని సారథి స్టూడియో వెనక గ‌ల మూడంతస్థుల బిల్డింగ్‌ పెంట్‌హౌస్‌లో ప్రముఖ వాస్తుశాస్త్ర నిపుణుడు VLN చౌదరి అద్దెకు ఉంటున్నారు. ఆరు నెలల క్రితం ఇంటి యజమాని ఖాళీ చేయమని చౌదరికి చెప్పారు. దీంతో అప్పటి నుంచి ఇంటి కొనుగోలు కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు చౌదరి. ఈ క్రమంలో ఇంటి కొనుగోలు కోసం తెచ్చిన రూ. 3 కోట్ల 93 లక్షల నగదుతో పాటు 450 గ్రాముల బంగారాన్ని పరుపు కింద 3 సూట్‌కేసుల్లో దాచుకున్నాడు.

ఈనెల 12న పని మీద బయటకువెళ్లిన చౌదరి.. రాత్రి 11 గంటలు దాటిన తర్వాత ఇంటికి తిరిగివచ్చాడు. అయితే పెంట్‌ హౌస్‌ మెట్లు, గోడలు, తలుపులు దెబ్బతిని ఉండడాన్ని చూసి షాక్‌ అయ్యాడు. ఇంట్లోకి వెళ్లి చూసేసరికి డబ్బుతో పాటు బంగారం, 30 ల్యాప్‌టాప్‌లు, 3 సెల్‌ఫోన్లు, విలువైన పేపర్స్ అన్ని మాయమయ్యాయి. దీంతో దొంగతనం జరిగిందని గుర్తించిన చౌదరి.. గురువారం రాత్రి మధురానగర్‌ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు..దర్యాప్తు ప్రారంభించారు.

Tags:    
Advertisement

Similar News