దేశం యావత్తు తెలంగాణ వైపే చూస్తోంది : బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్

తెలంగాణలో ఎన్నికలు రాబోతున్నాయి. ప్రజలు ఏవేవో మాటలు విని ఆగం కావొద్దు అని కేసీఆర్ అన్నారు.

Advertisement
Update:2023-08-28 06:25 IST

ఇండియా మొత్తం తెలంగాణ వైపు చూస్తోంది. రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాల వల్ల ఇప్పుడు తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా వెలుగొందుతోంది. తెలంగాణ ఆచరిస్తుంటే.. దేశం అనుసరిస్తోందని బీఆర్ఎస్ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని చూసి దేశం యావత్తు ఇప్పుడు రాష్ట్రం వైపే చూస్తోందని సీఎం కేసీఆర్ చెప్పారు. మహారాష్ట్రకు చెందిన మైనార్టీ నాయకులు ఆదివారం సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరారు. వీరందరికీ గులాబీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ..

త్వరలో తెలంగాణలో ఎన్నికలు రాబోతున్నాయి. ప్రజలు ఏవేవో మాటలు విని ఆగం కావొద్దు అని కేసీఆర్ అన్నారు. ప్రజల కోసం పని చేసే ప్రభుత్వాన్ని ఎన్నుకున్న‌ప్పుడే ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయని కేసీఆర్ చెప్పారు. మహారాష్ట్రలో సహజ వనరులు పుష్కలంగా ఉన్నాయి... అక్కడ ఎన్నోనదుల పుట్టి ప్రవహిస్తున్నాయి... కానీ ఆ రాష్ట్రంలో గ్రామాలు, నగరాలు నీళ్లు లేక ఎందుకు ఎండుతున్నాయో అక్కడి నేతలు చెప్పాలని కేసీఆర్ అడిగారు.

బీఆర్ఎస్ మహారాష్ట్రలో వస్తేనే ప్రగతి సాధిస్తుందని.. ఇక్కడి మైనార్టీ నేతలు కూడా ఇదే విషయం చెబుతున్నారని పార్టీ వర్గాలు వివరించాయి. కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ రాష్ట్రం సాధిస్తున్న ప్రగతిని మహారాష్ట్రలో చర్చిస్తున్నట్లు అక్కడి నాయకుల చెప్పారు. దేశంలో సాగిస్తున్న చాందసవాదాన్ని కూకటివేళ్లతో పెక‌లించే క్రమంలో అందరూ ఏకం కావాల‌ని కోరారు.  


Tags:    
Advertisement

Similar News