పెళ్లి కొడుకు కోసం మూడు గంటలు ఆగిన ట్రైన్
రైల్వే అధికారులు ఓ పెళ్లి కొడుకు కోసం మూడు గంటలు ట్రైన్ ఆపారు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్‌లో జరిగింది
పెళ్లి కోసం బస్సులు ఆపిన సంఘటనలు చూశాం. తొలిసారి ఓ పెళ్లి కోసం రైల్వే అధికారులు వేరే రైళ్లను ఆపడం ఆశ్చర్యం కలిగించింది. రైలు ఆలస్యం అవడం వల్ల ఓ వరుడు తన వివాహన్నికి అనుకున్న సమయానికి జరగదేమోనని భయపడ్డాడు. ఈ విషయాన్ని రైల్వే అధికారులకు ట్వీట్టర్ వేదిగా వెల్లడించారు. వెంటనే రైల్వే అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కనెక్టింగ్ రైలును నిలిపివేసి, ఆలస్యంగా నడుస్తున్న రైలును ఫాస్ట్ గా ముందుకు వెళ్లేలా చేశారు. అనుకున్న సమయానికి పెళ్లి వేదికకు చేరుకునేలా ఏర్పాట్లు చేశారు. పశ్చిమ బెంగాల్‌లో జరిగిందీ అరుదైన ఘటన. ముంబైకి చెందిన చంద్రశేఖర్ వాఘ్ అనే యువకుడి పెళ్లి అస్సాంలోని గువాహటి అమ్మాయితో నిశ్చయమైంది. చంద్రశేఖర్ ఈ నెల 14న 34 మంది కుటుంబ సభ్యులతో కలిసి ముంబైలో బయలుదేరి 15న హౌరా చేరుకుని అక్కడి నుంచి గువాహటి వెళ్లేందుకు రైలు టికెట్లు బుక్ చేసుకున్నారు.
అక్కడి వరకు బాగానే ఉన్నా.. ఆ తర్వాతే అసలు సమస్య మొదలైంది. వారు ఎక్కిన గీతాంజలి ఎక్స్‌ప్రెస్ మూడున్నర గంటలు ఆలస్యమైంది. ఇంత లేటుగా వెళ్తే హౌరాలో వారు ఎక్కాల్సిన సరైఘట్ ఎక్స్‌ప్రెస్‌ను అందుకోలేమని, అదే జరిగితే సమయానికి గువాహటి చేరుకోలేమని భావించిన చంద్రశేఖర్ వెంటనే అత్యవసర సాయం కోసం రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్, రైల్వేశాఖను ట్యాగ్ చేస్తూ ఎక్స్‌లో పోస్టు పెట్టాడు. చంద్రశేఖర్‌కు కలిగిన అసౌకర్యానికి స్పందించిన రైల్వేశాఖ గీతాంజలి ఎక్స్‌ప్రెస్ వచ్చే వరకు హౌరాలో సరైఘట్ ఎక్స్‌ప్రెస్‌ను నిలిపి ఉంచాలని అధికారులను ఆదేశించింది. చంద్రశేఖర్ బృందం హౌరా చేరుకున్నాక సరైఘట్ ఎక్స్‌ప్రెస్ కదిలింది. తన పెళ్లికి సమయానికి చేరుకునేలా సహకరించినందుకు రైల్వేశాఖకు, అధికారులకు చంద్రశేఖర్ ధన్యవాదలు చెప్పాడు.