విద్యార్థులు కుర్‌ కురేలు తిని అస్వస్థతకు గురయ్యారు

హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం వాదన

Advertisement
Update:2024-11-27 15:59 IST

నారాయణపేట జిల్లా మాగనూరు జెడ్పీ హైస్కూల్‌ విద్యార్థులు కుర్‌ కురేలు తిని అస్వస్థతకు గురయ్యారని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో వాదించింది. ప్రభుత్వ పాఠశాలలతో పాటు గురుకులాల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టడం లేదని దాఖలైన పిటిషన్‌ లపై హైకోర్టు సీజే అలోక్‌ అరాధే నేతృత్వంలోని బెంచ్‌ వాదనలు వినిపించింది. ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యంపై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున అడిషనల్‌ అడ్వొకేట్‌ జనరల్‌ వాదనలు వినిపిస్తూ.. పిల్లలు మధ్యాహ్నం భోజనం తినడంతో అస్వస్థతకు గురి కాలేదని.. స్కూల్‌ బయట వాళ్లు కుర్‌ కురేలు కొని తిన్నారని, వాటితోనే అస్వస్థతకు గురయ్యారని వాదించారు. ఇందుకు బాధ్యులైన అధికారులపై ఇప్పటికే చర్యలు తీసుకున్నామని తెలిపారు. మాగనూరుతో పాటు కరీంనగర్‌ జిల్లా బూరుగుపల్లి పాఠశాలల్లో ఘటనలపై తమకు నివేదిక ఇవ్వాలని, బాధ్యులైన అధికారులపై ఏం చర్యలు తీసుకున్నారో సమగ్ర నివేదిక అందజేయాలని అధికారులను ఆదేశించారు. ఫుడ్‌ పాయిజన్‌ అయిన స్కూళ్లలోని ఆహార శాంపుల్స్‌ సేకరించి పరీక్ష కోసం ల్యాబ్‌ కు పంపాలని ఆదేశించారు. సమగ్ర నివేదిక సోమవారంలోపు అందజేయాలని ఆదేశిస్తూ కేసు తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.

Tags:    
Advertisement

Similar News