నవంబర్‌ నెలాఖరులోగా క్రీడా విధానం సిద్ధం కావాలి

ఈ విధానంలో భాగంగా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ బిల్లు సాధ్య‌మైనంత త్వ‌ర‌గా రూపొందించాలన్న సీఎం

Advertisement
Update:2024-10-25 21:13 IST

జాతీయ, అంతర్జాతీయ వేదికలపై మన యువత సత్తా చాటేలా తెలంగాణ క్రీడా విధానానికి సంబంధించిన తుది ముసాయిదాను నవంబర్ నెలాఖరులోగా సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. తెలంగాణ క్రీడా విధానంపై సీఎం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించి సమీక్షించారు.ఈ విధానంలో భాగంగా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ (Young India Physical Education and Sports University - YIPESU)కి సంబంధించిన బిల్లు సాధ్య‌మైనంత త్వ‌ర‌గా రూపొందించాలని చెప్పారు. మరో పది రోజుల్లోగా యంగ్ ఇండియా స్పోర్ట్ వర్సిటీకి సంబంధించిన గవర్నింగ్ బాడీని ఖరారు చేయాలన్నారు. అత్యుత్తమ క్రీడా విధానం కోసం ద‌క్షిణ కొరియా స్పోర్ట్స్ యూనివర్సిటీ, ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌ల్యాండ్ యూనివ‌ర్సిటీ అనుస‌రిస్తున్న విధానాల‌ను అధ్య‌య‌నం చేయాల‌ని, ఈ రంగంలో నిపుణులు, క్రీడాకారులతో సంప్రదింపులు జరపాలని చెప్పారు. రాష్ట్ర, జాతీయ‌, అంత‌ర్జాతీయ క్రీడా పోటీల‌కు సంబంధించిన క్యాలెండ‌ర్‌ను వెంట‌నే త‌యారు చేయాలన్నారు. వ‌చ్చే రెండేళ్ల‌లో నేష‌న‌ల్ గేమ్స్‌కు తెలంగాణ ఆతిథ్యం ఇచ్చేలా ఇండియ‌న్ ఒలింపిక్ అసోసియేష‌న్‌ను సంప్రదించాల‌ని ఆదేశించారు.

ఈ సమీక్షా సమావేశంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి , పొంగులేటి శ్రీనివాస రెడ్డి , ప్ర‌భుత్వ స‌ల‌హాదారు కే.కేశ‌వ‌రావు , క్రీడా స‌ల‌హాదారు ఏపీ జితేందర్ రెడ్డి , రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మ‌న్ శివసేనారెడ్డి , ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి , రాష్ట్ర క్రీడ‌ల శాఖ ప్ర‌త్యేక ముఖ్య కార్య‌ద‌ర్శి జయేశ్ రంజన్ , ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Tags:    
Advertisement

Similar News