బీఆర్ఎస్ వాయిదా తీర్మానాన్ని తిరస్కరించిన స్పీకర్

లగచర్ల ఘటనపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వాయిదా తీర్మానాన్ని సభాపతి స్పీకర్ గడ్డం ప్రసాద్‌ తిరస్కరించారు.

Advertisement
Update:2024-12-16 12:42 IST

 లగచర్ల ఘటనపై బీఆర్ఎస్ సభ్యుల వాయిదా తీర్మానాన్ని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌ తిరస్కరించారు. సభాపతి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. బీఆర్ఎస్ నేతలు అసెంబ్లీలో నినాదాలు చేశారు..ఇక తెలంగాణ శాసనసభ కార్య విధాన మరియు కార్యక్రమ నిర్వహణ నియమావళిలోని 168 (1) నిబంధన ప్రకారం భారత రాష్ట్ర సమితి శాసనసభా పక్షం తరఫున ఆర్ధిక మంత్రి పై సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇస్తున్నట్లు తెలిపారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. తెలంగాణ అప్పులపైన శాసన సభను, తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించిన ప్రభుత్వంపైన ప్రివిలేజ్ మోషన్ కు అనుమతి ఇవ్వాలని కోరింది బీఆర్ఎస్. అర్ బిఅర్ఐ నివేధికలో తెలంగాణ అప్పులు కేవలం 3.89 లక్షల కోట్లు అని స్ఫష్టం చేస్తే ప్రభుత్వం మాత్రం 7 లక్షల కోట్ల అప్పులు అంటూ తప్పుదోవ పట్టించినందున సభాహక్కులు నోటీలు ఇస్తున్నట్లు తెలిపింది. దీంతో పాటు మూసీ పరీవాహకంలో అక్రమ నిర్మాణాల కూల్చివేతల్లో అనుమానలపై చర్చించాలన్న వాయిదా ప్రతిపాదనను సైతం తిరస్కరించారు.

Tags:    
Advertisement

Similar News