తెలంగాణలో అమలవుతున్న పథకాలు అద్భుతం,ఇవి దేశమంతా అమలు కావాలి... సీపీఐ రాజా
ఖమ్మంలో జరిగిన బీఆరెస్ బహిరంగ సభలో మాట్లాడిన రాజా ముందుగా , తెలంగాణ సాయుధ పోరాటంలో అసువులుబాసిన అమరవీరులకు జోహార్లు అర్పించారు. అద్భుతమైన ప్రజా అనుకూల పథకాలు ప్రవేశపెట్టి విజయవంతంగా నడుపుతున్నందుకు కేసీఆర్ కు అభినందనలు తెలిపారు. కేసీఆర్ మరిన్ని విజయాలు సాధించాలని ఆయన అన్నారు.
తెలంగాణలో పవర్ కట్ లు లేవు, 24 గంటలు విద్యుత్తు సరఫరా అవుతున్నది. రైతుల కోసం రైతు బంధు, దళితుల కోసం దళిత బంధు, తాగు నీరు, సాగు నీరు, కంటి వెలుగు...ఈ పథకాలు దేశానికే ఆదర్శమని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా అన్నారు. ఈ పథకాలు దేశమంతా అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఖమ్మంలో జరిగిన బీఆరెస్ బహిరంగ సభలో మాట్లాడిన రాజా ముందుగా , తెలంగాణ సాయుధ పోరాటంలో అసువులుబాసిన అమరవీరులకు జోహార్లు అర్పించారు. అద్భుతమైన ప్రజా అనుకూల పథకాలు ప్రవేశపెట్టి విజయవంతంగా నడుపుతున్నందుకు కేసీఆర్ కు అభినందనలు తెలిపారు. కేసీఆర్ మరిన్ని విజయాలు సాధించాలని ఆయన అన్నారు.
''ప్రస్తుతం రిపబ్లిక్ ఇండియా సంక్షోభంలో ఉంది. బీజేపీ, ఆరెస్సెస్ ముట్టడిలో ప్రజాస్వామ్యం ఉంది. భారత్ సెక్యూలర్ దేశమని మన రాజ్యాంగం చెప్తున్నది. ఇది సంక్షేమ రాజ్యమని, ఫెడరల్ రాజ్యమని మన రాజ్యాంగం చెప్తున్నది. కానీ బీజేపి వాటన్నిటిని నాశనం చేస్తున్నది. భారత దేశాన్ని హిందూ దేశంగా మార్చే ప్రమాదం ఉందని ఆనాడే అంబేద్కర్ చెప్పాడు. ఈ రోజు బీజేపి , ఆరెస్సెస్ లు అదే పని చేస్తున్నాయి. దీనిని మనం అడ్డుకోవాలి.'' అని రాజా పిలుపునిచ్చారు.
తెలంగాణలో అందించినట్టు ప్రతి ఒక్కరికీ విద్య, వైద్యం, ఉద్యోగాలు, ఆహారం ఎలా అందించాలో అందరం ఆలోచించాలన్నారు రాజా.
గవర్నర్లు ప్రజలతో ఎన్నుకోబడిన ప్రభుత్వాలను అస్థిరపర్చే కుట్రలు చేస్తున్నారని రాజా మండిపడ్డారు. తెలంగాణ, ఢిల్లీ, కేరళ, తమిళనాడు గవర్నర్లు ప్రతి రోజూ అక్కడి ముఖ్యమంత్రులతో గొడవలు పడుతున్నారని ఆయన అన్నారు.
బీజేపీ, ఆరెస్సెస్ లను అధికారంలోంచి దూరం చేస్తే తప్ప ఈ దేశం బాగుపడదని, అందరం ఐక్యంగా ఉంటే బీజేపీ, ఆరెస్సెస్ ల నుండి దేశాన్ని విముక్తి చేయగలం అని రాజా అన్నారు.