సంధ్య థియేటర్‌ ఘటన పోలీసుల వైఫల్యమే కారణం : కిషన్ రెడ్డి

సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు.

Advertisement
Update:2024-12-23 15:18 IST

సంధ్య థియేటర్‌ తొక్కిసలాట ఘటన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై దాడిపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బన్నీ ఎపిసోడ్‌కు కారణం తెలంగాణ పోలీసుల వైఫల్యమేనని కిషన్‌రెడ్డి అన్నారు. థియేటర్ వద్ద ఘటనకు నివారించడంలో పోలీసులు సరిగా వ్యవహరించాలేదని కిషన్‌రెడ్డి తెలిపారు. పరిస్ధితులను తెలంగాణ ప్రభుత్వం అనుకూలంగా మార్చకునేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డి కక్ష సాధింపుకు పాల్పడుతున్నడని కేంద్ర మంత్రి అన్నారు. రాజకీయాలకు సినిమాలకు ఏం సంబంధమని నిలదీశారు. పదేళ్ల బీఆర్ఎస్, కాంగ్రెస్ ఏడాది పాలనలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో సాధించింది ఏం లేదని అన్నారు. రెండు పార్టీలు ప్రజలను నమ్మించి మోసం చేశాయని విమర్శలు చేశారు. ఈ ఏడాదిలో బీజేపీ చాలా సవాళ్లను ఎదుర్కొందని అన్నారు. వచ్చే ఏడాదిలో ప్రజల మనోభిష్టం మేరకు పనిచేస్తామని కిషన్ రెడ్డి తెలిపారు.

తమ ముందు ఇంకా అనేక సవాళ్లు ఉన్నాయన్నారు. బీజేపీ , కాంగ్రెస్ పార్టీలు ఒక్కటే అని ఎవరు అనరని.. బీజేపీ సిద్ధాంతమే కాంగ్రెస్ పార్టీను ఓడించడమని తెలిపారు. కాంగ్రెస్‌కు తాము ఎప్పుడు వ్యతిరేకమేనని చెప్పారు. ప్రాంతీయ పార్టీలు లేకుండా చేస్తున్నామంటూ బీజేపీపై ఎవరు మాట్లాడిన తెలివి తక్కువ తనమే అవుతుందని కిషన్‌రెడ్డి విమర్శించారు. సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతిచెందిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. తెలంగాణ హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో చంచల్‌గూడ సెంట్రల్ జైలు నుంచి బన్నీని విడుదల చేశారు. ఆ తర్వాత తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ విషయంపై మాట్లాడిన సంగతి తెలిసిందే. 

Tags:    
Advertisement

Similar News