రికార్డు స్థాయిలో తెల్ల బంగారం ధర.. క్వింటాల్ ఎంతంటే?

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో పత్తి రికార్డు స్థాయిలో పలికింది. తెలంగాణలో తెల్లబంగారం కాసుల వర్షం కురుస్తున్నాది. ఇవాళ రికార్డు స్థాయిలో క్వింటాల్ పత్తి ధర రూ.7,521 పలికినట్లు అధికారులు వెల్లడించారు.

Advertisement
Update:2024-10-21 14:25 IST

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో పత్తి రికార్డు స్థాయిలో పలికింది. తెలంగాణలో తెల్లబంగారం కాసుల వర్షం కురుస్తున్నాది. ఇవాళ రికార్డు స్థాయిలో క్వింటాల్ పత్తి ధర రూ.7,521 పలికినట్లు అధికారులు తెలిపారు. మార్కెట్‌లో పత్తి పోటెత్తింది. కాగా, రైతులు నాణ్యమైన పత్తి తెచ్చి గరిష్ఠ ధర పొందాలని మంత్రి కొండా సురేఖ తెలిపారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దన్నారు. కొనుగోలు కేంద్రాల్లోని పత్తిని విక్రయించాలని ఆమె సూచించారు. మార్కెట్‌కు వచ్చిన ప్రతి బస్తాను కొనుగోలు చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. మార్కెట్‌లో రైతులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించామని స్పష్టం చేశారు. మార్కెట్లో పత్తి ధర బాగా పెరగటంతో కొంతలో కొంత రైతులకు ఊరట కల్గింది. దిగుబడులు రాని అన్నదాతను ధర ఆదుకుంది.

నాలుగు రూపాయలు మిగలకపోయినప్పటికీ నష్టం లేకుండా పెట్టుబడులు చేతికి వచ్చాయి. తొమ్మిది, పది క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చిన రైతులకు ఎకరానికి రూ. 25 వేల నుంచి రూ. 45 వేల వరకు మిగిలాయి. నామమాత్రపు దిగుబడి వచ్చిన పదిశాతం మంది రైతులు నష్టపోయారు. ఈ ఏడాది వాతావరణం పెద్దగా అనుకూలించలేదు. ప్రారంభంలో వర్షాలు పడకపోవటం వల్ల మొక్కల్లో ఎదుగుదల లోపించింది. తర్వాత అతివృష్టి వల్ల పంట దెబ్బతిన్నది. ఈలోగా గులాబీ రంగు పురుగు ఆశించడంతో దిగుబడి గణనీయంగా తగ్గింది.

Tags:    
Advertisement

Similar News