టెట్‌ అప్లికేషన్ల ప్రక్రియ షురూ

దరఖాస్తులకు చివరి తేదీ ఈనెల 20

Advertisement
Update:2024-11-08 17:06 IST
టెట్‌ అప్లికేషన్ల ప్రక్రియ షురూ
  • whatsapp icon

టీచర్‌ ఎలిజిబులిటీ టెస్ట్‌ (టీజీ టెట్‌ 2024 -25) అప్లికేషన్ల ప్రక్రియ మొదలైంది. శుక్రవారం నుంచి ఆన్‌లైన్‌ లో అప్లికేషన్లు స్వీకరిస్తున్నారు. అర్హులైన అభ్యర్థులు ఈనెల 20లోగా దరఖాస్తు చేసుకోవచ్చని విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. వచ్చే ఏడాది జనవరి ఒకటో తేదీ నుంచి 20వ తేదీ మధ్య టెట్‌ పరీక్ష నిర్వహిస్తారు. నిరుద్యోగుల నుంచి వ్యతిరేకత రావడంతో ఈసారి టెట్‌ ఫీజులు తగ్గించారు. గతంలో ఒక పేపర్‌ ఫీజు రూ.400 ఉండగా, దానిని రూ.వెయ్యికి పెంచారు. రెండు పేపర్లు రాసేవాళ్లు రూ.2 వేలు చెల్లించాల్సి వచ్చేది. ఇప్పుడు ఒక పేపర్ ఫీజు రూ.750, రెండు పేపర్లు రాసే వాళ్లు రూ.వెయ్యి చెల్లించాల్సి ఉంటుంది. టెట్‌ పేపర్‌ -1 పరీక్ష రాసేందుకు బీఈడీ, డీఈడీ చేసిన వాళ్లు అర్హులు. ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వాళ్లు సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ (ఎస్‌జీటీ) పోస్టులకు అర్హులు. పేపర్‌ -2లో అర్హత సాధించిన వాళ్లు స్కూల్‌ అసిస్టెంట్‌ ఉద్యోగాలకు అర్హులు. పేపర్‌ -2 లో మ్యాథమెటిక్స్‌ - సైన్స్‌ ఒక పేపర్ కాగా సోషల్‌ స్టడీస్‌ కు ఇంకో పేపర్‌ ఉంటుంది. టెట్‌ లో అర్హత సాధించిన వాళ్లే టీచర్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. టెట్‌ లో సాధించిన మార్కుల ఆధారంగా డీఎస్సీ, ఇతర టీచర్‌ రిక్రూట్‌మెంట్‌ లో 20 శాతం వెయిటేజీ ఇస్తారు.

Tags:    
Advertisement

Similar News