టీఆరెస్ లో చేరిన మునుగోడు కాంగ్రెస్ నాయకులు పల్లెరవి దంపతులు
సీనియర్ జర్నలిస్టు, మునుగోడు నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు పల్లె రవికుమార్, ఆయన భార్య చండూరు ఎంపీపీ పల్లె కల్యాణి లు టీఆరెస్ లో చేరారు. తెలంగాణ మంత్రి కేటీఆర్ సమక్షంలో ఆయన గులాబీ కండువా కప్పుకున్నారు.
మునుగోడు ఎన్నికల వేడి రాజుకుంటోంది. అధికార పార్టీలో చేరికలు పెరుగుతున్నాయి. సీనియర్ జర్నలిస్టు , కాంగ్రెస్ నాయకుడు పల్లె రవికుమార్, ఆయన భార్య మునుగోడు నియోజకవర్గం చండూరు ఎంపీపీ పల్లె కల్యాణి లు టీఆరెస్ లో చేరారు. తెలంగాణ మంత్రి కేటీఆర్ సమక్షంలో ఆయన గులాబీ కండువా కప్పుకున్నారు.
పల్లె రవి కుమార్ మునుగోడు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ టికట్ ఆశించారు. నిజానికి ఆయనకు టికట్ లభిస్తుందని చాలా మంది భావించారు. బీసీ సామాజిక వర్గం, ఆయన కుటుంబానికున్న కమ్యూనిస్టు బ్యాక్ గ్రౌండ్ , భార్య ఎంపీపీ కూడా అవడంతో ఆయనకు టిక్కట్ ఇస్తే బలమైన పోటీదారుడవుతారని స్థానికులు భావించారు. అయితే కోమటి రెడ్డి వెంకట రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి పట్టుబట్టి పాల్వాయి స్రవంతికి టికట్ ఇప్పించారు. ఈ నేపథ్యంలో కొంత కాలంగా ఆయన అసంత్రుప్తిగా ఉన్నారు. కాంగ్రెస్ లో ఉన్న అంతర్గత రాజకీయాలతో తట్టుకొని నిలబడటం కష్టమని భావిస్తున్న పల్లె రవి ఈ రోజు కేటీఆర్ సమక్షంలో టీఆరెస్ లో చేరారు.
తెలంగాణ ఉద్యమకాలం నుంచీ టీఆరెస్ నాయకులతో మంచి సంబంధాలున్న ఆయన చేరిక వల్ల మునుగోడు నియోజకవర్గంలోని ప్రధాన సామాజిక వర్గమైన గౌడ సామాజిక వర్గంలో టీఆరెస్ కు పట్టు లభిస్తుంది.