శాంతి భద్రతల వైఫల్యం వల్లే లగచర్ల ఘటన : డీకే అరుణ

సంగారెడ్డి సెంట్రల్‌ జైలులో రిమాండ్‌లో ఉన్న 16 మంది లగచర్ల బాధితులతో బీజేపీ ఎంపీలు డీకే అరుణ, ఈటల రాజేందర్‌ ములాఖత్‌ అయ్యారు

Advertisement
Update:2024-11-18 13:17 IST

వికారాబాద్ కలెక్టర్‌పై దాడి కేసులో సంగారెడ్డి సెంట్రల్ జైలులో ఉన్న 16 మందితో బీజేపీ ఎంపీలు ఈటల రాజేందర్, డీకే అరుణ ములాఖత్ అయ్యారు. లగచర్ల గ్రామంలో ఫార్మా కంపెనీకి భూములు ఇవ్వబోమని రైతులు 8 నెలలుగా ఆందోళన చేస్తున్నారని అరుణ అన్నారు. బలవంతంగా భూములు లాక్కుంటామని అధికారులు చెప్పడంతో రైతులు ఆగ్రహానికి గురయ్యారని పేర్కొన్నారు. రైతులు ప్రజాభిప్రాయ సేకరణను బహిష్కరించారని చెప్పారు.

వాస్తవంగా ప్రజాభిప్రాయ సేకరణకు రాకపోతే కలెక్టర్ ఒక్కరే ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు. పోలీసుల వైఫల్యంతోనే లగచర్ల ఘటన జరిగిందని డీకే అరుణ అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ సోదరుడు అక్కడ ఉన్న రైతులను భయపెట్టారని తెలిపారు. భూములు ఎలాగైనా గుంజుకుంటామని చెప్పారన్నారు. ఘటన తర్వాత రాత్రి గ్రామాల్లోకి వచ్చి పోలీసులు ఇష్టం వచ్చినట్టు దాడి చేశారని పేర్కొన్నారు. గొడవ జరిగిన ఘటనలో కాంగ్రెస్ పార్టీ వాళ్లను వదిలేసి మిగతా వాళ్లను అరెస్ట్ చేశారని అన్నారు. లగచర్లను ప్రజలు బహిష్కరించాలని చెప్పారు. లా అండ్ అర్డర్ వైఫల్యం వల్లే లగచర్లలో దాడి జరిగిందని డీకే అరుణ అన్నారు.

Tags:    
Advertisement

Similar News