కిస్మస్‌ను అధికారింగా నిర్వహించిన ఘనత కేసీఆర్‌దే : హరీశ్‌రావు
ఏసు ప్రభువు ప్రేమ, దయా గుణం, కరుణ, శాంతిని అందరిలో పెంపొందించారని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఇవే మనిషిని ఉన్నతమైన స్థానానికి చేరుస్తాయని తెలిపారు.
దేశంలో ఎక్కడా లేనివిధంగా కిస్మస్‌ను ప్రభుత్వం తరుపున అధికారింగా నిర్వహించిన ఘనత బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కే దక్కుతుందని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. సికింద్రాబాద్‌లోని సీఎస్‌ఐ వెస్లీ చర్చిలో గాడ్ విజన్ ఆధ్వర్యంలో మొదలైన క్రిస్మస్ సెలబ్రేషన్స్‌లో హరీశ్‌రావు ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. డిసెంబర్ నెల వచ్చిందంటే అది కిస్మస్ నెల అని ఆయన అన్నారు. ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులందరూ సంతోషంగా ఉంటారని హరీశ్‌రావు అన్నారు. ఇది అత్యంత పవిత్రమైన మాసంగా భావించి నిత్యం పండుగలా జరుపుకుంటారని తెలిపారు. ఏసు ప్రభువు ప్రేమ, దయా గుణం, కరుణ, శాంతిని అందరిలో పెంపొందించారని పేర్కొన్నారు. ఇవే మనిషిని ఉన్నతమైన స్థానానికి చేరుస్తాయని తెలిపారు.
ఉన్నతమైన స్థానం అంటే సంపద ఉండటమో, పదవి ఉండటమో కాదని హరీశ్‌రావు అన్నారు. గుణగణాలతో ఉన్నతంగా జీవించే వారే ఉన్నతమైన స్థానంలో ఉండేవారని వివరించారు. ఏసుప్రభు క్షమాగుణం అందరికీ ఆదర్శమని కొనియాడారు. తనను శిలువ వేసిన వారిని, తనను పట్టించిన వారిని కూడా క్షమించమని ప్రార్థించిన గొప్ప మహనీయుడు అని అన్నారు. ప్రపంచంలో అత్యంత ఎక్కువమంది జరుపుకునే పండుగ క్రిస్మస్ అని అన్నారు. ఈ రోజు గాడ్స్ విజన్ సంస్థ ఆధ్వర్యంలో ఈ పండుగ సంబరాలు జరుపుకోవడం, అందులో నేను పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. హిందువులైనా, క్రైస్తవులైనా, ముస్లింలైనా అందర్నీ సమానంగా చూసిన గొప్ప వ్యక్తి కేసీఆర్ అని కొనియాడారు. దేశంలో ఇతర రాష్ట్రాల్లో క్రైస్తవ ముఖ్యమంత్రులు ఉన్నాగాని క్రిస్మస్ పండుగను అధికారికంగా జరపలేకపోయారని అన్నారు. బతుకమ్మ పండుగకు కొత్త చీరలు ఇచ్చినట్లు, ముస్లింలకు కూడా కొత్త బట్టలు పంపిణీ చేశారని.. అలాగే క్రైస్తవులకు కూడా క్రిస్మస్ పండుగకు బట్టలు పంపిణీ చేసిన నాయకుడు కేసీఆర్ అని చెప్పారు