హైడ్రా కమిషనర్‌ పై హైకోర్టు సీరియస్‌.. ఆదివారమే కూల్చివేతలెందుకు?

శని, ఆదివారాల్లో కూల్చివేయొద్దని గతంలో హైకోర్టు ఆదేశాలున్న ఎందుకు కూల్చివేతలు చేపడుతున్నారని కోర్టు హైడ్రాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

Advertisement
Update:2024-09-30 11:40 IST

హైడ్రా కూల్చివేతలపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇవాళ కోర్టుకు హైడ్రా కమీషనర్ రంగనాథ్ వర్చువల్‌గా హాజరయ్యారు. శని, ఆదివారాలు సూర్యాస్తమయం తర్వాత ఎందుకు కూల్చివేతలు చేపడుతున్నారని హైకోర్టు ప్రశ్నించింది. అమీన్‌పూర్‌ తహసీల్దార్‌ కోర్టులో రంగనాథ్ వివరణ ఇచ్చారు.

నోటీసులు ఇవ్వకుండా ఎలా కూల్చివేతలు చేస్తున్నారో చెప్పండని కోర్టు నిలదీసింది. ప్రముఖ రాజకీయనాయకులను ఉన్నతాధికారులను మెప్పించేందుకు చట్టవిరుద్దంగా పని చేయవద్దని హైడ్రాకు కోర్టు సూచనలు చేసింది. హైడ్రాకు చట్టబద్దత, అధికారం ఏంటో చెప్పాండి మీరు చట్టాన్ని ఉల్లగించి కూల్చివేతలు చేస్తున్నారని పేర్కొన్నాది. ఆదివారం కూల్చివేతలు చేపట్టవద్దని ఇదే హై కోర్టు ఇచ్చిన ఆదేశాలు మీకు తెలియదాని ప్రశ్నించింది.

Tags:    
Advertisement

Similar News