హైదరాబాద్‌‌ చేరుకున్న రాష్ట్రపతి..ఘన స్వాగతం పలికిన గవర్నర్, సీఎం

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఒక రోజు పర్యటన నిమిత్తం హైదరాబాద్‌కు చేరుకున్నారు. బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్రపతికి.. గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి ఘన స్వాగతం పలికారు.

Advertisement
Update:2024-09-28 12:39 IST

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఒక రోజు పర్యటన నిమిత్తం హైదరాబాద్‌కు చేరుకున్నారు. బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్రపతికి.. గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు సీతక్క, పొన్నం, నగర మేయర్ ఘన స్వాగతం పలికారు. అనంతరం రాష్ట్రపతి శామీర్ పేటలోని నల్సార్ లా యూనివర్సిటీ 21వ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. అనంతరం బొల్లారంలోని రాష్ట్రపతి నినవాసానికి చెరుకుని అక్కడ భారతీయ కళా మహోత్సవాన్ని ప్రాభించనున్నారు.

ద్రౌపది ముర్ము పర్యటన సందర్భంగా ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. రాష్ట్రపతి నిలయంలో ఎనిమిది రోజులపాటు నిర్వహించే ఈశాన్య రాష్ర్టాల భారతీయ కళా మహోత్సవంను ప్రారంభించనున్నారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా మినిస్టర్‌ ఇన్‌ వెయిటింగ్‌గా మంత్రి సీతక్కను రాష్ట్ర సర్కార్ నామినేట్‌ చేసింది. రాష్ట్రపతిని స్వాగతించడం మొదలు సాగనంపడం వరకు ముర్ము వెంట సీతక్క ఉండనున్నారు.

Tags:    
Advertisement

Similar News