కేసీఆర్ సంకల్పానికి దేశ రాజకీయ వ్యవస్థ దిగివచ్చిన రోజు : కేటీఆర్‌

మహోజ్వల ఉద్యమాన్ని మలుపు తిప్పిన రోజు, స్వరాష్ట్ర కల సాకారానికి పునాది వేసిన రోజు డిసెంబర్‌ 9 అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు.

Advertisement
Update:2024-12-09 10:59 IST

మహోజ్వల తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన రోజు, స్వరాష్ట్ర కల సాకారానికి పునాది వేసిన రోజు డిసెంబర్‌ 9 అని మాజీ మంత్రి కేటీఆర్‌ అన్నారు. ‘కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో..’ అని చావునోట్లో తలపెట్టిన సంకల్పానికి దేశ రాజకీయ వ్యవస్థ దిగివచ్చిన రోజని చెప్పారు. తెలంగాణ చరిత్రలో నవంబర్ 29 లేకపోతే డిసెంబర్ 9 ప్రకటన లేదని స్పష్టం చేశారు. ఈ కీలక మలుపు లేకపోతే జూన్ 2 గెలుపు లేనే లేదన్నారు. దగాపడ్డ నేల విముక్తి కోసం ఉద్యమ సారథే ప్రాణత్యాగానికి సిద్ధమై తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ఊపిరిపోసిన దీక్షా విజయ్ దివస్ సందర్భంగా యావత్ తెలంగాణ ప్రజలకు, లక్షలాది గులాబీ సైనికులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

Tags:    
Advertisement

Similar News