నేటి నుంచి సీఎం బృందం దావోస్‌ పర్యటన

తెలంగాణలో పరిశ్రమల ఏర్పాటుకు ఉన్న అవకాశాలను వివరించడం సహా హైదరాబాద్‌ను ప్రపంచస్థాయి పెట్టుబడుల గమ్య స్థానంగా పరిచయం చేయనున్నారు.

Advertisement
Update:2025-01-20 10:36 IST

పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా సీఎం రేవంత్‌రెడ్డి సారథ్యంలోని తెలంగాణ రైజింగ్‌ బృందం నేటి నుంచి దావోస్‌లో పర్యటించనున్నది. సీఎం నేతృత్వంలోని బృందం సింగపూర్‌ పర్యటన ముగిసింది. నాలుగు రోజుల పాటు జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సు వార్షిక సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు, ఉన్నతాధికారులు పాల్గొంటారు. అంతర్జాతీయ వేదికపై తెలంగాణలో పరిశ్రమల ఏర్పాటుకు ఉన్న అవకాశాలను వివరించడం సహా హైదరాబాద్‌ను ప్రపంచస్థాయి పెట్టుబడుల గమ్య స్థానంగా పరిచయం చేయనున్నారు. దీంతె పాటు దేశ, విదేశాలకు చెందిన పారిశ్రామిక వేత్తలు, వివిధ రంగాలకు చెందిన నిపుణులతో చర్చలు జరపనున్నది. ఇప్పటికే మూడు రోజులు సింగపూర్‌లో పర్యటించిన ఈ బృందం రూ. 4000 కోట్ల పెట్టుబడులు ఆకర్షించింది. చివరి రోజున అక్కడి పారిశ్రామికవేత్తలు, బిజినెస్‌ ప్రతినిధులతో చర్చలు జరిపింది. ఈ పర్యటనలో సింగపూర్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ ( ఐటీఈ)తో తెలంగాణ యంగ్‌ ఇండియా స్కిల్‌ వర్సిటీ ఒప్పందం చేసుకున్నది. హైదరాబాద్‌లోని ఫ్యూచర్‌ సిటీలో రూ. 3,500 కోట్ల పెట్టుబడితో అత్యాధునిక కృత్రిమ మేధా డేటా ఆధారిత సెంటర్‌ ఏర్పాటుకు ఎస్టీ టెలీమీడియా డేటా సెంటర్‌ ఒప్పందం చేసుకున్నది. హైదరాబాద్‌లో రూ. 400 కోట్లతో ఐటీ పార్క్‌ ఏర్పాటకు క్యాపిటల్‌ లాండ్‌ కంపెనీ ముందుకు వచ్చింది. 

Tags:    
Advertisement

Similar News