ప్రధాని విమర్శలపై స్పందించిన సీఎం

ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్దానంపై పవిత్రమైన నిబద్ధతతో ఉన్నామన్న సీఎం రేవంత్‌ రెడ్డి

Advertisement
Update:2024-11-02 12:30 IST

తమ ప్రభుత్వ తప్పిదాలను ప్రధాని మోడీ వివరిస్తున్నందుకు సంతోషంగా ఉన్నదని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. ప్రధాని మోడీ విమర్శలపై సీఎం ఎక్స్‌ వేదికగా స్పందించారు. 'అధికారంలోకి వచ్చిన 2 రోజుల్లోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించాం. ఉచిత బస్సు ప్రయాణం వల్ల మహిళలకు రూ. 3,433 కోట్లు ఆదా అయ్యాయి. రాజీవ్‌ ఆరోగ్యశ్రీ కింద రూ. 10 లక్షల సదుపాయాన్ని అమల్లోకి తీసుకొచ్చాం. ఏడాది కాకముందే దేశంలోనే అతి పెద్ద రుణమాఫీ అమలు చేశాం. 22 లక్షల మంది రైతులకు రూ. 2 లక్షల వరకు రుణమాఫీ చేశాం. కేవలం 25 రోజుల్లోనే రుణమాఫీ కింద రూ. 18 వేల కోట్లు జమ చేశాం. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ సౌకర్యం కల్పించామని రేవంత్‌రెడ్డి తెలిపారు.

బీజేపీ పాలిత రాష్ట్రాల్లో గ్యాస్‌ ధరలు అధికంగా ఉన్నాయని.. కానీ తెలంగాణలో రూ. 500 కే సిలిండర్‌ ఇస్తున్నామన్నారు. ఇప్పటివరకు 43 లక్షల మందికి సిలిండర్‌ పథకం ద్వారా లబ్ధి చేకూరుతున్నది. అలాగే అధిక సంఖ్యలో ఉద్యోగ నియామకాలు చేపడుతున్నాం. గ్రూప్స్‌ పరీక్షలను రెగ్యులర్‌గా నిర్వహిస్తున్నాం. 11 నెలల్లోనే 50 వేలకుపైగా ఉద్యోగ నియామకాలు చేపట్టామన్నారు. నియామకాల్లో ఏ బీజేపీ పాలిత రాష్ట్రంతో పోల్చినా మాదే రికార్డని సీఎం తెలిపారు. హాస్టల్‌ విద్యార్థుల డైట్‌, కాస్మోటిక్‌ ఛార్జీలను 40 శాతానికి పైగా పెంచామన్నారు. మూసీ పునరుజ్జీవానికి నడుం బిగించాం. కబ్జాకు గురైన నీటి వనరులను సంరక్షిస్తున్నాం. ఫ్యూచర్‌ సిటీ కోసం మాస్టర్‌ ప్లాన్ ఖరారు చేస్తున్నాం. స్కిల్‌ వర్సిటీ, స్పోర్ట్స్‌ వర్సిటీ ఏర్పాటు చేస్తున్నాం. ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ ఏర్పాటు చేస్తున్నాం. ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్దానంపై పవిత్రమైన నిబద్ధతతో ఉన్నామన్నారు. 

Tags:    
Advertisement

Similar News