రైతుకు బేడీలు వేసిన ఘటనపై స్పందించిన సీఎం
విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆదేశం
Advertisement
సంగారెడ్డి జైలులో గుండెపోటు వచ్చిన లగచర్ల రైతు హీర్యానాయక్ ను బేడీలతో సంగారెడ్డి ఆస్పత్రికి తీసుకెళ్లిన ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఈమేరకు సీఎంవో నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు. గుండెపోటు వచ్చిన రైతును బేడీలతో ఆస్పత్రికి తీసుకెళ్లడంపై సీఎం సీరియస్ అయ్యారని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. రైతును బేడీలతో తీసుకెళ్లాల్సిన అవసరం ఏమోచ్చిందని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారని ప్రెస్‌నోట్‌లో వెల్లడించారు. ప్రజాప్రభుత్వం ఇలాంటి చర్యలను సహించబోదని హెచ్చరించారని.. ఘటనపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఉన్నతాధికారులను ఆదేశించారని పేర్కొన్నారు.
Advertisement