కవితపై అనుచిత వ్యాఖ్యల కేసు... విచారణకు రావాలని బండి సంజయ్‌కి పోలీసుల నోటీసులు!
పంజాగుట్ట పోలీసు స్టేషన్ లో నమోదైన కేసు నేపథ్యంలో ఆ పోలీసు స్టేషన్ పోలీసులు బండి సంజయ్ కి నోటీసులు జారీ చేశారు. సోమవారం విచారణకు హాజరు కావాల్సిందిగా తమ నోటీసులో పోలీసులు పేర్కొన్నారు.
బీఆరెస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కి పంజా గుట్ట పోలీసులు నోటీసులు జారీ చేశారు.
కవితపై సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనపై తెలంగాణలోని. అనేక పోలీసు స్టేషన్ లలో కేసులు నమోదు చేశారు. హైదరాబాద్ లోని బంజారా హిల్స్ పోలీసు స్టేషన్ లో జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పిర్యాదుచేయగా అక్కడ కేసు నమోదయ్యింది. అదే విధంగా పంజా గుట్ట పోలీసు స్టేషన్ లో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పిర్యాదు చేయగా అక్కడ కూడా కేసు నమోదయ్యింది.
పంజాగుట్ట పోలీసు స్టేషన్ లో నమోదైన కేసు నేపథ్యంలో ఆ పోలీసు స్టేషన్ పోలీసులు బండి సంజయ్ కి నోటీసులు జారీ చేశారు. సోమవారం విచారణకు హాజరు కావాల్సిందిగా తమ నోటీసులో పోలీసులు పేర్కొన్నారు.
కాగా, సజయ్ , కవితపై చేసిన వ్యాఖలకు సంబంధించి సుమోటోగా కేసు స్వీకరించిన రాష్ట్ర మహిళా కమిషన్ కూడా సంజయ్ కి నోటీసులు జారీ చేయగా శనివారం సంజయ్ కమిషన్ ముందు హాజరై సమాధానం ఇచ్చారు. తాను ఆ వ్యాఖ్యలు ఉద్దేశపూర్వకంగా చేయలేదని చెప్పారు. అయితే మరో సారి మహిళలపై ఈ విధమైన అనుచిత వ్యాఖ్యలు చేయవద్దని బండి సంజయ్ ని కమిషన్ హెచ్చరించినట్టు సమాచారం.