తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో బీజేపీదే అధికారం : కిషన్‌రెడ్డి

తెలంగాణ అభివృద్ధికి వ్యతిరేకంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు వ్యవహరిస్తున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు.

Advertisement
Update:2024-11-14 14:43 IST

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి మిడి మిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర గవర్నర్ ఏ నిర్ణయం తీసుకోవాలన్న లీగల్ ఒపీనియన్ తీసుకోవాల్సి ఉందన్నారు. తెలంగాణ అభివృద్ధికి వ్యతిరేకంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు వ్యవహరిస్తున్నాయని ఆయన విమర్శించారు.వైఫల్యాలను, అసమర్ధత నుంచి దృష్టి మళ్లించేందుకు రెండు పార్టీలు పోటీ పడుతున్నాయని,ఇతర పార్టీల ఇచ్చే సర్టిఫికెట్స్ తమకు అవసరం లేదని కిషన్ రెడ్డి అన్నారు.

బీఆర్ఎస్ హయాంలో ప్రధాని మోదీ తెలంగాణకు వచ్చి ప్రాజెక్టులు ప్రారంభించడానికి వస్తే బయటకు రాని కేసీఆర్, కేటీఆర్‌కు మాట్లాడే అర్హత లేదన్నారు. కలెక్టర్ మీద దాడి తప్పు అని.. కానీ గ్రామస్తులపై అక్రమ కేసులు పెట్టడం కూడా సరికాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో జరిగిన ఘటన అని, ఆయన తన ప్రజలతో మాట్లాడాలని కిషన్ రెడ్డి సూచించారు. తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

Tags:    
Advertisement

Similar News