అంతర్జాతీయ క్రీడాకారులను తయారుచేసేలా టీజీఎస్పీ

నిఖత్‌, సిరాజ్‌ సాయంతో ప్రత్యేక శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్న డీజీపీ

Advertisement
Update:2025-01-03 13:36 IST

అంతర్జాతీయ క్రీడాకారులను తీర్చిదిద్దేలా భవిష్యత్తులో టీజీఎస్పీని తీర్చిదిద్దుతామని డీజీపీ జితేందర్‌ తెలిపారు. హైదరాబాద్‌ యూసఫ్‌గూడలోని బెటాలియన్‌లో కానిస్టేబుళ్ల పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌లో ఆయన పాల్గొన్నారు. శిక్షణ పూర్తి చేసుకుని విధుల్లో చేరనున్న549 మంది కానిస్టేబుళ్లకు శుభాకాంక్షలు చెప్పారు. ఇటీవలే టీజీఎస్పీలో సిరాజ్‌, నిఖత్‌ జరీన్‌ వంటి అంతర్జాతీయ క్రీడాకారులు సిబ్బందిగా చేరారని వారి సాయంతో క్రికెట్‌, బాక్సింగ్‌లో శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని డీజీపీ వెల్లడించారు.

గ్రేహౌండ్స్‌ గాని, ఆక్టోపస్‌గాని, టీజీఎస్పీకి జాతీయస్థాయిలో పెద్ద పేరున్నది. దానికి మీరంతా కారణం అన్నారు. మన రాష్ట్రంలో కొన్ని కొత్త ఆర్గనైజేషన్స్‌ వచ్చాయి. సైబర్‌ క్రైమ్‌, సేఫ్టీ బ్యూరో, టీజీ న్యాబ్‌ అలాగే ఇతర సంస్థలు. ఈ రోజు నేను అందరికీ చెబుతున్నాను. వీటన్నింటిలో మీ భాగస్వామ్యం ఉంటుందన్నారు. భవిష్యత్తులో టీజీఎస్పీ ఒలింపియన్స్‌ను తయారు చేస్తుందన్నారు. . అంతర్జాతీయ క్రికెటర్లను తయారు చేయడానికి శిక్షణ ఇవ్వడానికి సిరాజ్‌కు విజ్ఞప్తి చేస్తున్నాం. దీనికోసం ఒక స్టేడియంను నిర్మిస్తామన్నారు. ఈ శిక్షణ కేంద్రాలు కేవలం టీజీఎస్పీకే కాదు అందరికీ ఇందులో అవకాశం కల్పిస్తామన్నారు.

నా కల నెరవేరింది.. గర్వంగా ఉంది

తెలంగాణ పోలీస్‌ యూనిఫామ్‌ ధరించడం గర్వంగా ఉన్నదని అంతర్జాతీయ బాక్సర్‌, డీఎస్పీ నిఖత్‌ జరీన్‌ అన్నారు. హైదరాబాద్‌ యూసఫ్‌గూడ బెటాలియన్‌లో జరిగిన పోలీస్ పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌లో ఆమె పాల్గొన్నారు. పోలీస్‌ ఉద్యోగం రావడంతో తన కల నెరవేరిందన్నారు. టీజీఎస్పీలో బాక్సింగ్‌ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని డీజీపీ ప్రకటించారని ఆ అకాడమీలో తన వంతు పాత్ర పోషిస్తానని నిఖత్‌ జరీన్‌ తెలిపారు. పాసింగ్‌ పరేడ్‌ లో పాల్గొనడం నాకు ఇది మొదటిసారి అన్నారు. 

Tags:    
Advertisement

Similar News