సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టీజీపీఎస్సీ నూతన చైర్మన్ బుర్రా వెంకటేశం
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని టీజీపీఎస్సీ నూతన ఛైర్మన్ బుర్రా వెంకటేశం మర్యాదపూర్వకంగా కలిశారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టీజీపీఎస్సీ నూతన ఛైర్మన్ బుర్రా వెంకటేశం మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డికి పుష్పగుచ్చం ఇచ్చి అభినందనలు తెలిపారు. దీనికి సంబంధించిన ఫైల్ గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉంది. అయితే గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. ప్రస్తుత చైర్మన్ మహేందర్ రెడ్డి పదవీకాలం డిసెంబర్ 3న ముగియనుండగా.. అదే రోజు వెంకటేశం బాధ్యతలు స్వీకరించడానికి లైన్ క్లియర్ అయింది. టీజీ పీఎస్సీ పై గతంలో వచ్చిన ఆరోపణలు, కార్పొరేషన్ ప్రక్షాలణ లక్ష్యంగా బుర్రా వెంకటేశం పనిచేసేందుకు ఆయనను నియమించినట్లు తెలుస్తొంది.
కొత్త చైర్మన్ నియామకానికి తెలంగాణ ప్రభుత్వం గతంలోనే నోటిఫికేషన్ జారీచేసి దరఖాస్తులు ఆహ్వానించింది. మొత్తం 45 మంది దరఖాస్తు చేసుకోగా, అందులో రిటైర్డ్ ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, వివిధ యూనివర్సిటీలకు చెందిన ప్రొఫెసర్లు ఉన్నారు. వారిలో చైర్మన్ పోస్టుకు బుర్రా వెంకటేశంను ఎంపికచేసిన సర్కారు ఈ నియామకం ఆమోదం కోసం ఫైల్‌ను రాజ్‌భవన్‌కు పంపించింది. దీంతో గవర్నర్ శనివారం ఆ ఫైల్‌పై ఆమోదముద్ర వేశారు. బుర్రా వెంకటేశంకు మరో మూడున్నరేండ్ల సర్వీసు ఉండగా, టీజీపీఎస్సీ చైర్మన్‌గా 62 ఏండ్ల వరకు కొనసాగే అవకాశం ఉన్నది. ఈ నేపథ్యంలో కొత్త చైర్మన్ ఐదున్నరేండ్లు అంటే 2030 వరకు కొనసాగనున్నారు.