షర్మిల పాదయాత్ర అనుమతి రద్దు.. ఆమెను అదుపులోకి తీసుకొని హైదరాబాద్ తరలించిన పోలీసులు
ఈ రోజు ఉదయం ప్రారంభం కానున్న షర్మిల పాదయాత్రని బీఆరెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. పెద్ద ఎత్తున బీఆరెస్ కార్యకర్తలు ఆమె బసచేసిన క్యాంపు వద్దకు బయలుదేరారు.
మహబూబాబాద్ ఎమ్మెల్యే, బారత రాష్ట్ర సమితి నాయకుడు శంకర్ నాయక్ పై వైఎస్సార్ టీపీ నాయకురాలు షర్మిల చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై బీఆరెస్ కార్యకర్తలు ఆగ్రహంగా ఉన్నారు. కొద్ది సేపటిక్రితం మహబూబాబాద్ నియోజకవర్గంలో అనేక చోట్ల బీఆరెస్ కార్యకర్తలు ఆందోళనలకు దిగారు.
ఈ రోజు ఉదయం ప్రారంభం కానున్న షర్మిల పాదయాత్రని బీఆరెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. పెద్ద ఎత్తున బీఆరెస్ కార్యకర్తలు ఆమె బసచేసిన క్యాంపు వద్దకు బయలుదేరారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో బీఆరెస్ కార్యకర్తలు వైఎస్ఆర్టీపీకి చెందిన ఫ్లెక్సీలు దగ్ధం చేశారు. ఎమ్మెల్యే శంకర్ నాయక్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు షర్మిల క్షమాపణ చెప్పాలని కార్యకర్తలు డిమాండ్ చేశారు. మహబూబాబాద్ జిల్లాలో ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఉద్రిక్తత నేపథ్యంలో పోలీసులు షర్మిల పాదయాత్రకు అనుమతి రద్దు చేశారు. ఈ మేరకు షర్మిలకు ఎస్పీ నోటీసులు జారీ చేశారు. దాంతో షర్మిల పాదయాత్ర ఆగిపోయింది. శంకర్ నాయక్ పై షర్మిల చేసిన వ్యాఖ్యలపై బీఆరెస్ నాయకులు పిర్యాదు చేయడంతో ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకొని హైదరాబాద్ తర లించారు