ఎన్టీఆర్ స్టేడియం వద్ద ఉద్రిక్తత..కానిస్టేబుళ్ల అరెస్ట్

హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బెటాలియన్ కానిస్టేబుళ్లును అరెస్టు చేశారు.

Advertisement
Update:2024-10-28 14:57 IST

హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియం వద్దకు వస్తున్న బెటాలియన్ కానిస్టేబుళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. తమ డిమాండ్లను నెరవేర్చాలని కానిస్టేబుళ్ల విధించిన సస్పెన్షన్ ఎత్తివేయాలని నినదిస్తూ ఎన్టీఆర్ స్టేడియం వైపు వస్తున్న బెటాలియన్ కానిస్టేబుళ్లు తెలంగాణ పోలీసులను ముందస్తు చర్యల్లో భాగంగా అరెస్టు చేశారు. ఓకే పోలీస్.. ఓకే స్టేట్ విధానాన్ని అమలు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. తమను పోలీసు ఉన్నతాధికారలను కాళి కింద చెప్పులాగా చూస్తున్నారని, వెట్టిచారికి చేయిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్వరాష్ట్రంలో కష్టపడి ఉద్యోగం తెచ్చుకున్న 39 మంది కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారని, 10 మందిని నేరుగా కాంగ్రెస్ సర్కార్ ఉద్యోగం నుండి తీసివేసిందన్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు సీఎం రేవంత్ రెడ్డి 100 సార్లు ఏక్ పోలీస్ విధానాన్ని అమలు చేస్తానని చెప్పాడని, ఈ సందర్బంగా బాధిత కానిస్టేబుళ్లు గుర్తుచేశారు. ఇప్పుడు మమ్మల్ని కనీసం కలవడం లేదని కానిస్టేబుళ్లు ఒక్కసారిగా వాపోయారు. సీఎం రేవంత్ రెడ్డి, డీజీపీ మమ్మల్ని ఒకసారి పిలిచి తమతో చర్చలు జరగపాలని బెటాలియన్ కానిస్టేబుల్ డిమాండ్ చేశారు. వెంటనే తమ డిమాండ్లను నెరవేర్చకపోతే పోరాటాన్ని మరింత ఉదృతం చేస్తామని హెచ్చరించారు.

తమ సహోద్యోగులు సస్పెన్షన్‌ గురికావడంతో వారికి బెటాలియన్‌ కానిస్టేబుళ్లంతా మద్దతు నిలిచారు. ఆదివారం సెలవు రోజు అయినప్పటికీ సస్పెన్షన్‌ను వెనక్కి తీసుకోవాలని బెటాలియన్ల ముట్టడి చేపట్టారు. గంటలకొద్దీ బెటాలియన్‌ ముఖద్వారం వద్ద నిరసన చేపట్టినా.. కమాండెంట్‌ పట్టించుకోకపోవడంతో పట్టరాని కోపంతో రోడ్డెక్కారు. అనంతరం రాత్రి వేళ కొవ్వొత్తులతో నిరసన ప్రదర్శన చేపట్టారు. అయినప్పటికీ రేవంత్ సర్కారులో చలనం రాకపోవడంతో ఉద్యమ కార్యాచరణ ప్రకారం సోమవారం సచివాలయ ముట్టడికి పిలుపునిచ్చారు బెటాలియన్‌ కానిస్టేబుళ్లు సెక్రటేరియట్‌ ముట్టడికి పిలుపునివ్వడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. సెక్రటేరియట్‌ వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు. సచివాలయం చుట్టూ భారీగా పోలీసులను మోహరించారు. పరిపాలన సౌధం చుట్టూ 163 సెక్షన్‌ విధించారు. సెక్రటేరియట్‌ పార్కింగ్‌ గ్రౌండ్‌లో సుమారు 200 మంది సిబ్బందిని మోహరించారు. ఎన్టీఆర్‌ స్టేడియం వద్ద పోలీసు వాహనాలు, సిబ్బందిని సిద్ధంగా ఉంచారు. కాగా, వీడియోలు తీయడానికి మీడియాకు అనుమతి లేదని పోలీసులు చెబుతున్నారు.

Tags:    
Advertisement

Similar News