ఉమెన్ కమిషన్ చైర్ పర్సన్ కలిసిన సింగర్ కల్పన ఎందుకంటే?

కొన్ని యూట్యూబ్ ఛానల్స్ అసత్య ప్రచారం చేస్తున్నాయని సింగర్ కల్పన మహిళా కమిషన్ చైర పర్సన్ నేరెళ్ల శారదను కలిశారు.;

Advertisement
Update:2025-03-08 18:49 IST

ప్రముఖ గాయనీ కల్పన తెలంగాణ మహిళా కమిషన్ చైర పర్సన్ నేరెళ్ల శారదను కలిశారు. నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించినట్లు కొన్ని యూట్యూబ్ ఛానల్స్ అసత్య ప్రచారం చేస్తున్నాయని వాటిపై తీసుకోవాలని ఫిర్యాదు చేశారు.తన ప్రైవేటు వీడియోలతో ట్రోల్ చేస్తున్నారని ఆరోపించారు. అలాంటి వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని సింగర్ కల్పన మహిళా కమిషన్ చైర పర్సన్ నేరెళ్ల శారదను కోరారు.సోషల్ మీడియా వేదికగా మహిళలను ట్రోల్ చేసే వారికి ఉమెన్ కమిషన్ చైర్‌పర్సన్ నేరళ్ల శారద స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇక నుంచి ఇష్టం వచ్చినట్లుగా పోస్టింగ్స్ పెడితే బాధ్యులపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

రాష్ట్ర వ్యాప్తంగా మహిళలపై అసభ్యకర పోస్టులు పెట్టే వారిపై ఇప్పటికే స్పెషల్ ఫోకస్ పెట్టామని, ఆ విషయాన్ని ట్రోలర్స్ దృష్టిలో పెట్టుకోవాలని నేరళ్ల శారద అన్నారు. సింగర్ కల్పన విషయంలో కేపీహెచ్‌బీ పోలీసులు వివరణ ఇచ్చారు. ఆమె ఫ్యామిలీతో సహా కేరళ ఎర్నాకుళంలో నివాసం ఉంటున్నారు. గత ఏది ఎళ్లుగా ఆమె భర్తతో కలిసి నిజాంపేట్ లోని విల్లాలో ఉంటున్నారు.. కల్పనా కూతురు దయా ప్రసాద్ చదువు విషయంలో ఆమెకు ఆమె కూతురు మధ్య మనస్పర్ధలు వచ్చాయి. నిన్న ఎర్నాకుళం నుండి హైదరాబాద్ కి ఉదయం 11:45 నిమిషాలకు చేరుకున్న కల్పన.. ఒంటిగంట 40 నిమిషాలకు ఎయిర్పోర్ట్ నుండి ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చిన తర్వాత నిద్ర పట్టకపోవడంతో జోల్ ఫ్రెష్ నిద్రమాత్రలు వేసుకుంది. అయినా నిద్ర రాకపోవడంతో మరో 10 నిద్రమాత్రలు వేసుకొని అపస్మారక స్థితికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత తనకి ఏం జరిగిందో తెలియదని స్టేట్మెంట్లో చెప్పింది కల్పన.

Tags:    
Advertisement

Similar News