రాష్ట్ర ప్రయోజనాల కోసం అందరూ ఏకం కావాలి : భట్టి

తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం అందరం ఏకం కావాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఎంపీలకు పిలుపునిచ్చారు;

Advertisement
Update:2025-03-08 15:49 IST

తెలంగాణ ప్రయోజనాల కోసం అందరం ఏకం కావాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ప్రజాభవన్‌లోఉప ముఖ్యమంత్రి అధ్యక్షతన తెలంగాణ ఎంపీల సమావేశం నిర్వహించారు.కేంద్ర ప్రభుత్వాన్ని కలిసి మన సమస్యలను వివరించాలని భట్టి పేర్కొన్నారు. ఉన్నత భావాలతో ఎంపీలతో సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కేంద్రం నుండి రావాల్సిన నిధుల కోసం పోరాడాలని ఎంపీలకు డిప్యూటీ సీఎం పిలుపునిచ్చారు. దాదాపు 28 అంశాలపై సమావేశంలో చర్చించినట్లు తెలిపారు. విభజన సమస్యలపై పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చినట్లు పేర్కొన్నారు.

మరోవైపు చివరి నిమిషంలో ఈ సమావేశానికి బీజేపీ ఎంపీలు గైర్హాజరు అయ్యారు. ఆహ్వానం ఆలస్యంగా అందిందని.. ఎంపీల సమావేశంపై పార్టీలో చర్చించుకునే సమయం కూడా లేదు.. ముందుగా నిర్ణయించుకున్న పార్టీ కార్యక్రమాల కారణంగా హాజరు కాలేకపోతున్నాం.. భవిష్యత్‌లో ఇలాంటి సమావేశాలు నిర్వహిస్తే కాస్త ముందుగా తెలియాజేయాలని కేంద్ర కిషన్ రెడ్డి భట్టికి లేఖ రాశారు.ఈ సమావేశానికి మజ్లిస్ పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కూడా హాజరయ్యారు. బీజేపీ, బీఆర్ఎస్ ఎంపీలు గైర్హాజరయ్యారు

Tags:    
Advertisement

Similar News