హైదరాబాద్ గన్ పార్క్ వద్ద ఉద్రిక్తత...బండి సంజయ్ ని అదుపులోకి తీసుకున్న పోలీసులు
ఈ రోజు బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఎటువంటి అనుమతులు లేకుండా హఠాత్తుగా హైదరాబాద్ అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్ పార్క్ లో ధర్నా చేపట్టారు. ఆయన తో పాటు ఆయన అనుచరులు కూడా అక్కడ చేరారు.
TSPSC పేపర్ లీకేజీ వ్యవహారంపై 9మందిని అరెస్ట్ చేసిన పోలీసులు దర్యాప్తును వేగవంత చేశారు. ఈ వ్యవహారంపై హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ సిట్ ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో పేపర్ లీకేజీ వ్యవహారంపై బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీలు ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి.
ఈ రోజు బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఎటువంటి అనుమతులు లేకుండా హఠాత్తుగా హైదరాబాద్ అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్ పార్క్ లో ధర్నా చేపట్టారు. ఆయన తో పాటు ఆయన అనుచరులు కూడా అక్కడ చేరారు. అక్కడ ధర్నా చేయడానికి అనుమతి లేదని ఆ స్థలాన్ని ఖాళీ చేయాలని పోలీసులు బండి సంజయ్ ని కోరారు. ట్రాఫిక్ కు ఇబ్బందులు ఏర్పడ్డాయని, వాహనదారులు చాలా అవస్థలు పడుతున్నారని పోలీసులు సంజయ్ కి చెప్పారు. అయితే బండి సంజయ్ పోలీసుల సూచనను పట్టించుకోకపోగా ర్యాలీగా TSPSC కార్యాలయాని వెళ్ళడానికి ప్రయత్నించారు. దాంతో పోలీసులు సంజయ్ తో సహా బీజేపీ కార్యకర్తలను అడ్డుకున్నారు. అయినా వారు వినకపోవడంతో పోలీసులు బండి సంజయ్ తో సహా పలువురు బీజేపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు.
పోలీసులు బండిని అదుపులోకి తీసుకుంటున్న సమయంలో ఆయన అనుచరులు అడ్డుకోవడంతో పోలీసులకు, బీజేపీ కార్యకర్తలకు వాగ్వివాదం జరిగింది.