స్వచ్చ సర్వేక్షణ్: తెలంగాణకు మరో ఏడు అవార్డులు

స్వచ్ఛ సర్వేక్షణ్ 2022 ర్యాంకింగ్స్‌లో తెలంగాణ మొత్తం 23 అవార్డులు, ఇండియన్ స్వచ్ఛతా లీగ్ (ISL) కింద మరో మూడు అవార్డులు సాధించింది. స్వచ్ఛ సర్వేక్షణ్ 2022లో సాధించిన మొత్తం అవార్డుల సంఖ్య పరంగా మహారాష్ట్ర తర్వాత, తెలంగాణ ఇప్పుడు దేశంలో రెండవ స్థానంలో ఉంది.

Advertisement
Update:2022-11-25 07:54 IST

స్వచ్ఛ సర్వేక్షణ్ 2022లో తెలంగాణ తన సత్తా కొనసాగిస్తోంది. ఇప్పటికే అనేక అవార్డులు సొంత చేసుకున్న తెలంగాణా తాజాగా మరో 7అవార్డులు దక్కించుకుంది. "ఫాస్ట్ మూవింగ్ సిటీ" విభాగంలో మరో ఏడు పట్టణ స్థానిక సంస్థలు అవార్డులను పొందాయి.

ఈ అవార్డులతో, స్వచ్ఛ సర్వేక్షణ్ 2022 ర్యాంకింగ్స్‌లో తెలంగాణ మొత్తం 23 అవార్డులు, ఇండియన్ స్వచ్ఛతా లీగ్ (ISL) కింద మరో మూడు అవార్డులు సాధించింది. స్వచ్ఛ సర్వేక్షణ్ 2022లో సాధించిన మొత్తం అవార్డుల సంఖ్య పరంగా మహారాష్ట్ర తర్వాత, తెలంగాణ ఇప్పుడు దేశంలో రెండవ స్థానంలో ఉంది.

హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ మంత్రిత్వ శాఖ నవంబర్ 21న వివిధ విభాగాల్లో ఫాస్ట్ మూవింగ్ సిటీస్ అవార్డులను ప్రకటించింది, ఇందులో తెలంగాణ మరో ఏడు అవార్డులను కైవసం చేసుకుంది.

ఫాస్ట్ మూవింగ్ మీడియం సిటీ (3-10 లక్షల మధ్య జనాభా) వరంగల్ (అర్బన్) దేశంలోనే 3 స్థానం

ఫాస్ట్ మూవింగ్ సిటీ (50,000-1,00,000 మధ్య జనాభా) కాగజ్‌నగర్, కుమ్రం భీమ్ జిల్లా 2వ స్థానం

ఫాస్ట్ మూవింగ్ సిటీ (50,000-1,00,000 మధ్య జనాభా) జనగాం 3వ స్థానం

ఫాస్ట్ మూవింగ్ సిటీ (25,000-50,000 మధ్య జనాభా) అమన్ గల్, రంగారెడ్డి జిల్లా 2వ స్థానం

ఫాస్ట్ మూవింగ్ సిటీ (15000 - 25,000 మధ్య జనాభా) గుండ్ల పోచంపల్లి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా 2వ స్థానం

ఫాస్ట్ మూవింగ్ సిటీ (15000 - 25,000 మధ్య జనాభా) కొత్తకోట, వనపర్తి జిల్లా 3వ స్థానం

ఫాస్ట్ మూవింగ్ సిటీ (జనాభా 15,000 ల లోపు) వర్ధన్నపేట, వరంగల్ (రూరల్) జిల్లా 2 స్థానం సాధించాయి. 

Tags:    
Advertisement

Similar News