'వారాహి'కి బ్రేకులు.. రూల్స్ బ్రేక్ చేశారన్న తెలంగాణ వాహన రిజిస్ట్రేషన్ శాఖ

లారీ చాసిస్‌ను బస్సుగా మార్చడం.. వాహనం ఉండాల్సిన హైట్ కంటే ఎక్కువ ఉండటం, మైన్స్‌లో వాడాల్సిన వాహన టైర్లను రోడ్లపై వాడటం రూల్స్‌కు విరుద్ధమంటూ వాహన రిజిస్ట్రేషన్​ విభాగం సూచించింది. అంతేగాక ఆర్మీకి సంబంధించిన కలర్‌ను ఒక సివిల్​ వాహనానికి ఉపయోగించొద్దని పేర్కొంది.

Advertisement
Update:2022-12-11 18:54 IST

ఇటీవల పవన్ కల్యాణ్ బస్సు యాత్ర కోసం ఓ వాహనాన్ని సిద్ధం చేసిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన ఫొటోలను పవన్ సోషల్ మీడియాలో పోస్టు చేయగా.. విపరీతంగా వైరల్ అయ్యాయి. అయితే ఈ వాహనం మీద వైసీపీ, జనసేన సైనికులు సోషల్ మీడియాలో పరస్పర కౌంటర్లు చేసుకున్నారు. వారాహి వాహనానికి ఉపయోగించే కలర్.. కేవలం ఆర్మీ వాహనాలకు మాత్రమే వాడలన్నది వైసీపీ కార్యకర్తల వాదన. దీన్ని జనసైనికులు తీవ్రంగా తప్పుపట్టారు.

ఏకంగా పవన్ కల్యాణే.. ఇందుకు సంబంధించి ట్విట్టర్‌లో ఓ పోస్టు పెట్టారు. ఆంక్షలు కేవలం తమకేనా? అంటూ ప్రశ్నించారు. గతంలో ఇటువంటి వాహనాలను రిజిస్ట్రేషన్ చేశారంటూ కొన్ని వాహనాల ఫొటోలను పోస్టు చేశారు. అయితే ఆ వాహనాలు కూడా ఈ దేశానివి కావని.. కొందరు వైసీపీ కార్యకర్తలు గుర్తించారు. మొత్తంగా వారాహి మీద పెద్ద వివాదమే నడిచింది.

అయితే ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియా వింగ్ చెప్పిందే నిజమైంది. వారాహి వాహనానికి అనుమతి లేదని.. తెలంగాణ వాహన రిజిస్ట్రేషన్ శాఖ తేల్చి చెప్పింది. లారీ చాసిస్‌ను బస్సుగా మార్చడం.. వాహనం ఉండాల్సిన హైట్ కంటే ఎక్కువ ఉండటం, మైన్స్‌లో వాడాల్సిన వాహన టైర్లను రోడ్లపై వాడటం రూల్స్‌కు విరుద్ధమంటూ వాహన రిజిస్ట్రేషన్​ విభాగం సూచించింది. అంతేగాక ఆర్మీకి సంబంధించిన కలర్‌ను ఒక సివిల్​ వాహనానికి ఉపయోగించొద్దని పేర్కొంది. ఇవన్నీ మార్చుకుని వస్తేనే రిజిస్ట్రేషన్ చేయగలమని ఆఫీసర్లు తేల్చిచెప్పారు. మరి దీనిపై జనసేన ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

Tags:    
Advertisement

Similar News