పవన్ కళ్యాణ్ 'వారాహి' వాహనానికి లభించిన రవాణా శాఖ అనుమతులు
వారాహి వాహనం రంగు ఆలీవ్ గ్రీన్ కాదని, ఎమరాల్డ్ గ్రీన్ కలర్ అని తెలంగాణ రవాణా శాఖ అధికారులు నిర్దారించారు.ఆ వాహనానికి అనుమతులు ఇవ్వడానికి ఎలాంటి సమస్య లేదని అన్నీ చట్టానికి తగ్గట్టుగానే ఉన్నాయని తెలంగాణ డిప్యూటీ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ పాపారావు చెప్పారు.
జనసేన ఛీఫ్ పవన్ కళ్యాన్ తలపెట్టిన బస్సు యాత్ర కోసం తయారు చేసిన వారాహి వాహనం పై వివాదాలు రేగిన విషయం తెలిసిందే. ఆ వాహనం రంగు, ఎత్తు తదితర అంశాలపై విమర్శలు వచ్చాయి.ముఖ్యంగా ఆ వాహనానికి ఆర్మీ వాళ్ళు మాత్రమే ఉపయోగించే ఆలీవ్ గ్రీన్ రంగు ఉపయోగించడం వల్ల రవాణా శాఖ కూడా ఆ వాహనానికి రిజిస్ట్రేషన్ చేయలేదన్న వార్తల నేపథ్యంలో జనసేనాని ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ వినిపించింది తెలంగాణ రవాణా శాఖ.
వారాహి వాహనం రంగు ఆలీవ్ గ్రీన్ కాదని, ఎమరాల్డ్ గ్రీన్ కలర్ అని తెలంగాణ రవాణా శాఖ అధికారులు నిర్దారించారు.ఆ వాహనానికి అనుమతులు ఇవ్వడానికి ఎలాంటి సమస్య లేదని అన్నీ చట్టానికి తగ్గట్టుగానే ఉన్నాయని తెలంగాణ డిప్యూటీ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ పాపారావు ఓ ప్రైవేట్ న్యూస్ ఛానల్ తో చెప్పారు. వాహనం బాడీకి సంబంధించిన సర్టిఫికెట్ తో సహా అన్ని విషయాలను కూలంకుషంగా పరిశీలించిన తర్వాత వారాహి వాహనానికి రిజిస్ట్రేషన్ కార్యక్రమం పూర్తి చేసి వారాహికి TS 13 EX 8384 నెంబరు కేటాయించినట్టు ఆయన చెప్పారు.