ట్రాఫిక్ చలాన్లకు డిస్కౌంట్‌.. ఏ వెహికిల్‌కు ఏంతంటే.!

ఈసారి గతంలో కంటే ఎక్కువ డిస్కౌంట్ ఇచ్చారు. గతేడాది మార్చిలో చలాన్లకు డిస్కౌంట్ ద్వారా రూ.300 కోట్లు వసూలయ్యాయి.

Advertisement
Update:2023-12-22 17:17 IST

తెలంగాణలో వాహనదారులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది ప్రభుత్వం. ఎన్నికల ముందు ఇచ్చిన హామీకి అనుగుణంగా పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్ ఆఫర్ తీసుకువచ్చింది. ఈ మేరకు తాజాగా అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం తెలంగాణలో 2 కోట్లకుపైగా పెండింగ్ చలాన్లు ఉన్నాయి. ఈనెల 26 నుంచి వచ్చే నెల 10 వరకు చలాన్ల క్లియరెన్స్‌కు అవకాశం ఇచ్చారు. ఈసారి గతంలో కంటే ఎక్కువ డిస్కౌంట్ ఇచ్చారు. గతేడాది మార్చిలో చలాన్లకు డిస్కౌంట్ ద్వారా రూ.300 కోట్లు వసూలయ్యాయి. ఈసారి కూడా వాహనదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని పోలీసులు కోరారు.

ఏయే వెహికిల్స్‌కు ఎంత డిస్కౌంట్ అంటే

టూ వీలర్స్, ఆటోలు - 80% డిస్కౌంట్‌

హెవీ వెహికిల్స్‌, కార్లు - 60% డిస్కౌంట్‌

ఆర్టీసీ బస్సులు - 90% డిస్కౌంట్‌

తోపుడు బళ్లు - 90% డిస్కౌంట్‌

Tags:    
Advertisement

Similar News